STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Tuesday 19th March 2019
Markets_main1552965068.png-24676

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్పనష్టాలతో ట్రేడవుతున్నప్పటికీ,  వరుసగా ఆరురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11,524 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,494  పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆసియా సూచీలన్నీ స్వల్పనష్టాలతో కదులుతున్నాయి.   



You may be interested

లాభాల ప్రారంభం..వెంటనే నష్టాల్లోకి

Tuesday 19th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ సూచీలు లాభాలతో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లు స్వల్పనష్టాలతో ట్రేడవుతున్న కారణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల స్వీకరణ జరగడంతో హెవీవెయిట్‌ షేర్లు ప్రారంభగరిష్టస్థాయి నుంచి తగ్గాయి. 100 పాయింట్లకుపైగా లాభంతో 38,200 పాయింట్ల సమీపంలో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,243 పాయింట్ల వరకూ పెరిగిన తర్వాత ఐదు నిముషాల్లోనే 38,091 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. అలాగే

చాలా తక్కువలో ట్రేడవుతున్న హోల్డింగ్‌ కంపెనీలు

Tuesday 19th March 2019

మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా దిగ్గజ కంపెనీల వ్యాల్యూషన్లు పడిపోయిన విషయాన్ని ఇన్వెస్టర్లు కళ్లారా చూశారు. స్టాండలోన్‌ కంపెనీలను విశ్లేషించడం సులువే. కానీ, ఎన్నో కంపెనీలకు పేరెంట్‌ కంపెనీగా ఉన్న స్టాక్‌ను విశ్లేషించడం అంత సులువేమీ కాదన్నది విశ్లేషకుల మాట. ఇక హోల్డింగ్‌ కంపెనీ షేరును కొన్నారంటే.. అందులో ఉన్న వ్యాపారాలన్నింటిపై ఇన్వెస్ట్‌ చేసినట్టే అవుతుంది. వీటిల్లో వ్యాపారాలన్నీ ఇన్వెస్టర్లను ఆకర్షించేవి కాకపోవచ్చు. నిజానికి హోల్డింగ్‌ కంపెనీల షేర్ల ధరలు

Most from this category