STOCKS

News


10,900 సమీపంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 7th January 2019
Markets_main1546830255.png-23442

అంతర్జాతీయ సానుకూల ట్రెండ్‌ ఫలితంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10,900 పాయింట్ల స్థాయిని సమీపించింది. వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ పాలసీ నుంచి వెనక్కుతగ్గే సంకేతాల్ని అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ వెల్లడించడంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపిన నేపథ్యంలో భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్లకు అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.20 గంటలకు110 పాయింట్ల పెరుగుదలతో 10,888 పాయింట్ల వద్ద కదులుతోం‍ది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 10,778 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 

ఆసియా మార్కెట్లు జంప్‌...

ఫెడ్‌ ఛైర్మన్‌ ప్రకటనతో గత శుక్రవారం అమెరికా సూచీలు 3 శాతం మేర ర్యాలీ జరిపిన ప్రభావంతో ప్రధాన ఆసియా సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. జపాన్‌ నికాయ్‌ సూచి 3 శాతంపైగా పెరగ్గా, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, తైవాన్‌ వెయిటెడ్‌, కొరియా కోస్పిలు 1.5 శాతం మేర పెరిగాయి. గత వారాంతంలో 3 శాతం వరకూ పెరిగిన హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి తాజాగా మరో 1.5 శాతం జంప్‌చేసింది. చైనా షాంఘై మాత్రం స్వల్పలాభాలతో మొదలయ్యింది. 



You may be interested

భారీ గ్యాప్‌అప్‌...సెన్సెక్స్‌ 276 పాయింట్లు జంప్‌

Monday 7th January 2019

నిఫ్టీ 78 పాయింట్లు అప్‌ ప్రపంచ ట్రెండ్‌ సానుకూలత కారణంగా సోమవారం భారత్‌ మార్కెట్‌ భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఒక్కసారిగా276 పాయింట్ల లాభంతో 35,971 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 10, 805పాయింట్ల వద్ద మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు భారీగా జంప్‌చేసాయి. వేదాంత, టాటా స్టీల్‌, హిందాల్కోలు 2-3 శాతం మేర పెరిగాయి. బ్యాంకింగ్‌ షేర్లు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌,

ఓఎన్‌జీసీని పిండేస్తున్న కేంద్రం!

Sunday 6th January 2019

చమురు అన్వేషణ, ఉత్పత్తిలో అతిపెద్ద ప్రభుత్వరంగ కంపెనీ ఓఎన్‌జీసీ... కేంద్ర ప్రభుత్వానికి బంగారు బాతులు పెట్టే గుడ్డు మాదిరిగా మారిపోయింది. కేంద్రం తన నిధుల సమీకరణ అవసరాల్లో భాగంగా ప్రభుత్వరంగ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మరీ షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్ల రూపంలో ఆదాయం పొందుతోంది. ఈ కార్యక్రమంలో ఓఎన్‌జీసీ కూడా భాగమైపోయింది. అప్పులు తీసుకుని మరీ, కేంద్రానికి నిధులను ధారబోస్తోంది ఓఎన్‌జీసీ.   ఓఎన్‌జీసీ 2016-17, 2017-18లో అస్సలు రుణాలే తీసుకోలేదు. మరీ

Most from this category