STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Tuesday 26th March 2019
Markets_main1553570030.png-24793

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్నదన్న భయాలతో క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి కుదుటపడిన నేపథ్యంలో మంగళవారం పాజిటివ్‌ ఓపెనింగ్‌కు సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా పెరిగింది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 2 పాయింట్ల లాభంతో 11,372 పాయింట్ల వద్ద కదులుతోంది. సోమవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,370  పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు రాత్రి అమెరికా సూచీలు పాజిటివ్‌గా ముగియగా, కొరియా మినహా మిగిలిన ఆసియా సూచీలు తాజాగా అరశాతం వరకూ లాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Tuesday 26th March 2019

ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలతో క్రితం రోజు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైన భారత్‌ సూచీలు మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 37,884 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,375 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో తిరిగి పీఎస్‌యూ షేర్లే జంప్‌చేసాయి. ఐఓసీ 3 శాతంపైగా పెరగ్గా, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, హింద్‌ పెట్రోలు 2-3 శాతం మధ్య

ఎన్నికల ఫలితాల వరకు బుల్లిష్‌ మూమెంటమ్‌...

Tuesday 26th March 2019

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈక్విటీ మార్కెట్లలో బుల్లిష్‌నెస్‌ ఉంటుందని ఈక్విటీ 99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణతో సూచీలు నష్టపోయినట్టు చెప్పారు. బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ఫిబ్రవరి 19 నుంచి నిఫ్టీ 987 పాయింట్లు పెరిగిందని, ఫిబ్రవరి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.40వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేసినట్టు చెప్పారు. మార్చి నెలలో విదేశీ నిధుల పెట్టుబడులు ఈ

Most from this category