STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Friday 22nd March 2019
Markets_main1553224283.png-24740

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పూర్తిగా సరళతర విధానాన్ని అనుసరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో  నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ  భారత్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45  గంటలకు 11,578  పాయింట్ల వద్ద కదులుతోంది.బుధవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,553  పాయింట్ల వద్ద ముగిసింది. హోలీ పండుగ కారణంగా మన మార్కెట్లకు గురువారం సెలవన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రేట్ల పెంపు వుండబోదని ఫెడ్‌ బుధవారంనాటి సమీక్ష అనంతరం సంకేతాలు అందించడంతో పాటు ప్రస్తుత ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది. అలాగే బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి నిధుల్ని ఉపసంహరించే ప్రక్రియను ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి నిలిపివేయనున్నట్లు ఫెడ్‌ తెలిపింది. ఈ వార్త అనంతరం బుధవారం క్షీణించిన అమెరికా సూచీలు గురువారం తిరిగి పెరిగాయి.  అయితే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో ఆసియా సూచీలు తాజాగా లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. జపాన్‌ నికాయ్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘైలు తొలుత పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికీ, ఉదయం 8.40 గంటలకు అరశాతం వరకూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌, తైవాన్‌ సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Friday 22nd March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పూర్తిగా సరళతర విధానాన్ని అనుసరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో  నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ  భారత్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 38,452 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల పెరుగుదలతో 11,549 పాయింట్ల వద్ద మొదలయ్యింది.   ఈ ఏడాది రేట్ల పెంపు వుండబోదని ఫెడ్‌ బుధవారంనాటి సమీక్ష అనంతరం సంకేతాలు

ఆర్‌ఈసీ ఇక పీఎఫ్‌సీ సొంతం

Thursday 21st March 2019

ప్రభుత్వరంగంలోని విద్యుత్‌ రంగ ఫైనాన్స్‌ సంస్థలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ మధ్య డీల్‌ ఖరారైంది. పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యాన్ని విధించుకున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్యం చేరికలో భాగంగానే కేంద్ర సర్కారు ఆర్‌ఈసీలో తనకున్న 52.63 శాతం వాటాను పీఎఫ్‌సీకి విక్రయించడం ద్వారా నిధుల సమీకరణకు మొగ్గు చూపించింది. ఈ డీల్‌కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ

Most from this category