News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th March 2019
Markets_main1552113253.png-24500

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి  నష్టాలతో 11,024.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11076.05 పాయింట్లతో పోలిస్తే 52పాయింట్ల నష్టంతో ఉంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలతో ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.  వచ్చే వారంలో దేశీయ సాదరణ ఎన్నికలకు నోటిఫికేషన్‌, మంగళవారం(12న) జనవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాల విడుదల మార్కెట్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలతో శుక్రవారం మార్కెట్‌ నాలుగురోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 36,671 వద్ద, నిఫ్టీ 10500 మార్కును చేజార్చుకుని 23 పాయింట్లు నష్టపోయి 11,035 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 36,671 వద్ద, నిఫ్టీ 10500 మార్కును చేజార్చుకుని 23 పాయింట్లు నష్టపోయి 11,035 వద్ద ముగిసింది. 
3శాతం పతమనమైన టాటామోటర్స్‌ ఏడీఆర్‌:-
అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గత రాత్రి మిశ్రమంగా ముగిశాయి. టాటామోటర్స్‌ ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు 3శాతం నుంచి 0.50శాతం నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌లు 1.50శాతం నుంచి అరశాతం లాభంతో ముగిశాయి. చైనాలో అమ్మకాలు బాగా తగ్గడంతో టాటామోటర్స్‌ విలాస కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అంతర్జాతీయ అ‍మ్మకాలు 4శాతం తగ్గాయి. దీంతో రాత్రి టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3శాతం నష్టపోయి 12.90డాలర్ల వద్ద స్థిరపడింది. అలాగే డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1శాతం పెరిగి 37.52డాలర్ల వద్ద, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అరశాతం నష్టపోయి 10.50 డాలర్ల వద్ద ముగిశాయి.



You may be interested

బంగారం.. ర్యాలీకి రెడీ!

Saturday 9th March 2019

అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం బంగారం ధర పెద్దగా మార్పులేకుండా 1280 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ వృద్ధి అంచనాలు తిరోగమనం పడుతున్న సంకేతాలు వస్తున్నందున ఇకపై బంగారం ధర దూసుకుపోయే ఛాన్సులున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే పలు దేశాల కేంద్ర బ్యాంకులు మానిటరీ పాలసీ సడలింపులకు దిగుతున్నాయి. మరోవైపు చైనా, ఈసీబీ 2019 సంవత్సరానికి వృద్ధి అంచనాలను తగ్గించాయి. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత స్థానంగా

పిజ్జా అదిరెన్‌... డోనట్‌ ఎగిరేన్‌...!!!

Saturday 9th March 2019

జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు ముందున్నాయి మంచి రోజులు అంటున్నాయి బ్రోకరేజీ సంస్థలు. ఎందుకంటే నిర్ణీత లక్ష్యానికంటే ఒక త్రైమాసికం ముందుగానే డంకిన్‌ డోనట్స్‌ బ్రేక్‌ఈవెన్‌ (లాభ, నష్ట రహిత) దశకు వచ్చేసింది. డంకిన్‌ డోనట్స్‌ యూనిట్‌ కారణంగా జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ ఎబిట్డా 250 బేసిస్‌ పాయింట్లను నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు కంపెనీకి సంబంధించి అతిపెద్ద ఆదాయం తెచ్చిపెట్టే డామినోస్‌ మాత్రం మంచి పనితీరు చూపిస్తోంది. ముడిపదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో డామినోస్‌

Most from this category