STOCKS

News


స్వల్పంగా తగ్గిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 27th March 2019
Markets_main1553656050.png-24812

 క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి కుదుటపడిన నేపథ్యంలో క్రితం రోజు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు బుధవారం స్వల్ప తగ్గుదలతో లేదా ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 8 పాయింట్ల నష్టంతో 11,502 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,510 పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు రాత్రి అమెరికా సూచీలు పాజిటివ్‌గా ముగియగా, తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌ నికాయ్‌, తైవాన్‌ వెయిటెడ్‌ సూచీలు స్వల్ప నష్టాలతోనూ, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, చైనా షాంఘైలు స్వల్ప లాభాలతోనూ ట్రేడవుతున్నాయి.



You may be interested

నిఫ్టీ 48 పాయింట్ల గ్యాప్‌అప్‌

Wednesday 27th March 2019

క్రితం రోజు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు బుధవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 138 పాయింట్ల లాభంతో 38,372 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,532 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే నిఫ్టీ 11,538 పాయింట్ల గరిష్టస్థాయిని, సెన్సెక్స్‌ 38,456 పాయింట్ల గరిష్టస్థాయిని టచ్‌చేసాయి. ఐఓసీ, వేదాంత, భారతి ఎయిర్‌టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌లు 1-2 శాతం మధ్య లాభాలతో

ధీరేంద్రకుమార్‌ సూచించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌

Tuesday 26th March 2019

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) వంటి దీర్ఘకాల పెట్టుబడులు భారీ రిటైర్మెంట్‌ నిధికి దారితీస్తాయని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ అధినేత ధీరేంద్ర కుమార్‌ సూచించారు. పన్ను ఆదా కోసం చివరి వరకు వేచి చూస్తుంటారని, ప్రణాళిక ప్రకారం ఈ పెట్టుబడులు ముందు నుంచే చేయడం మంచిదని సూచించారు. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌ నుంచే సిప్‌ ఆరంభించాలన్నారు. పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడులు 10-15-20 ఏళ్ల

Most from this category