STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు డౌన్‌

Tuesday 9th July 2019
Markets_main1562642446.png-26906

కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల పట్ల అసహనంగా క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.50 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,546 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,566 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రపంచ సూచీల క్షీణత..

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మొదలైన నేపథ్యంలో గత రాత్రి అమెరికా సూచీలు క్షీణించగా తాజాగా ఆసియా మార్కెట్లు  నష్టపోయాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.8  శాతం నష్టాలతో ట్రేడవుతుండగా, చైనా షాంఘై,   కొరియా కోస్పి,  సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌ స్వల్పనష్టాలతో ట్రేడవుతుండగా, జపాన్‌ నికాయ్‌ మాత్రం స్వల్పలాభాలతో కదులుతోంది. గత రాత్రి అమెరికాలో టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 0.7 శాతం క్షీణించగా, డోజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ500 సూచీలు అరశాతం చొప్పున నష్టపోయాయి. 



You may be interested

68.76 వద్ద రూపీ ప్రారంభం

Tuesday 9th July 2019

గత సెషన్‌లో దేశియ ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనం కావడంతో పాటు బడ్జెట్‌లో సంపన్నులపైన సర్‌ చార్జీలను పెంచడంతో 2,000 విదేశీ ఫండ్‌లపైన ప్రభావం పడింది. ఈ ఫండ్‌లు దేశియ మార్కెట్లను విడిచి పెట్టి వెళ్లిపోతాయనే భయాల నేపథ్యంలో సోమవారం 24 పైసలు బలహీనపడి డాలర్‌ మారకంలో 68.66 వద్ద ముగిసింది. రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 10 పైసలు బలహీనపడి 68.76 వద్ద ప్రారంభమైంది.

ముందున్నది మరింత పెయిన్‌?

Monday 8th July 2019

సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఎంతో ఆశపెట్టుకోగా, కొత్త విత్తమంత్రి నిరాశకు గురి చేయడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కూడా కోల్పోయింది. అయితే, ఇంకాస్త పతనం మిగిలి ఉందంటున్నారు విశ్లేషకులు.   నిఫ్టీ-50 గత శుక్రవారంతో పోలిస్తే సోమవారం భారీ భేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. 50రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌నూ కూడా కోల్పోయి, బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ ప్యాటర్న్‌ను డైలీ

Most from this category