STOCKS

News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిప్టీ

Monday 11th February 2019
Markets_main1549856469.png-24117

విదేశీ మార్కెట్లో  ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం గం.8:50ని.లకు 10,930.00 వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి పోలిస్తే 27పాయింట్ల నష్టంతో ఉంది. అందువల్ల నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియాలో చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, హాంగ్‌కాంగ్‌ మార్కెట్ల లాభాల్లో ఉండగా, మిగిలిన మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార అంశంపై సందేహాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేయడంతో శుక్రవారం రాత్రి అమెరికా మిశ్రమంగా ముగిశాయి.  యూరప్‌లో ప్రధాన మార్కెట్లైన  యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి. ఈ నేపథ్యంలో నేడు  దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 11th February 2019

10,900 దిగువన నిఫ్టీ ప్రారంభం ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్కెట్‌ మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,900 పాయింట్ల దిగువన ప్రారంభంకాగా,  సెన్సెక్స్‌ 130 పాయింట్లు నష్టంతో 36,416 పాయింట్ల వద్ద మొదలైంది. ఎఫ్‌ఎంజీసీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఫార్మా,  షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు మెటల్‌, మీడియా షేర్లలో స్వల్పంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.  నిఫ్టీ - 50 ఇండెక్స్‌లో గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌,

రాబోయే వారం ఎలా ఉంటుంది?

Saturday 9th February 2019

గత వారం నిఫ్టీ ఉర్రూతలూగించినట్లు కనిపించినా చివరకు తుస్సుమని నిరాశ పరిచింది. వారం చివర్లో పతనమై వారం మొత్తం ఆర్జించిన లాభాలను దాదాపు ఆవిరి చేసింది. వారాంతానికి నిఫ్టీ దాదాపు అరశాతం మాత్రమే లాభపడి 10943 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త వారం పేలవ ఆరంభం ఉండొచ్చని అంచనా. మార్కెట్లు మరోమారు కన్సాలిడేషన్‌ లేదా కరెక‌్షన్‌ బాట పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. గతవారం

Most from this category