STOCKS

News


‍స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 16th February 2019
Markets_main1550301015.png-24217

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి 10762.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10746.55 పాయింట్లతో పోలిస్తే 16పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ లాభంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ లాభాల్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక మనమార్కెట్‌ విషయానికొస్తే ... కంపెనీల క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, విదేశీ సంకేతాలు మిశ్రమంగా ఉండటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించడటం, తదితర కారణాలతో సూచీలు వరుసగా ఏడోరోజూ నష్టాలతో ముగిశాయి. గత  ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,166 పాయింట్లు నష్టపోయింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 737 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు చొప్పున క్షీణించాయి. రెండు సూచీలు చెరో 2 శాతం పతనమయ్యాయి. 
డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 4.50శాతం డౌన్‌..! 
అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌)లో ఒక్క టాటామోటర్స్‌ తప్ప, మిగిలిన అన్ని ఏడీఆర్‌లు నష్టాలతో ముగిశాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ షేర్లు 4.50శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. అయితే టాటామోటర్స్‌ ఏడీఆర్‌ మాత్రం 0.25శాతం లాభాల్లో ముగిసింది. జెఫ్పారీస్‌ రేటింగ్‌ సం‍స్థ బూచుపల్లి యూనిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ లెవనెత్తిన 11 అభ్యంతరాల కారణంగా జెఫ్పారీస్‌ రేటింగ్‌ సంస్థ షేరు టార్గెట్‌ ధరను తగ్గించడంతో నిన్నటి భారత స్టాక్‌ మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు రాత్రి అమెరికా మార్కెట్లో 4.50శాతం నష్టపోయి 35.98 డాలర్ల వద్ద స్థిరపడింది. విప్రో ఏడీఆర్‌ 1.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.10శాతం నష్టపోయాయి. అయితే ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎలాం‍టి లాభ, నష్టాలకు లోనవుకుండా 10.76 డాలర్ల వద్ద స్థిరపడింది.



You may be interested

లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 16th February 2019

చైనాతో వాణిజ్య చర్చలు సఫలవమచ్చనే ఆశావహనంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వాషింగ్టన్‌లో వచ్చే వారంలో కూడా చైనాతో వాణిజ్య చర్చలు కొనసాగుతాయి. చైనా దిగుమతులపై అదనపు సుంకాల విధింపునకు తుది గడువు మార్చి 1వ తేది నాటికి ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభింవచ్చని ఆశిస్తునట్లు శుక్రవారం వైట్‌హౌస్‌ ఓ అధికార ప్రకటనతో తెలిపింది. గోల్డ్‌మెన్‌ శాచ్స్‌, జేపీ మోర్గాన్‌ లాంటి ఆర్థిక షేర్ల ర్యాలీతో డోజోన్స్‌

ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.12,000 కోట్ల ఎల్‌ఐసీ నిధులు !

Saturday 16th February 2019

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ మరో రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొండి బకాయిలకు కేటాయింపుల కోసం ఈ స్థాయి పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తుందని సమాచారం. ఈ విషయమై ఇటీవలనే ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఆర్థిక సేవల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. కాగా తాజా పెట్టుబడుల విషయమై ఎల్‌ఐసీ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.  ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ.21,624 కోట్లు  ఐడీబీఐ

Most from this category