News


స్వల్పలాభంతో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ

Monday 21st January 2019
Markets_main1548042560.png-23684

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల ట్రెండ్‌కు అనుగుణంగా ఎస్‌జీఎక్స్ నిఫ్టీ స్వల్పలాభంతో ట్రేడ్‌ అవుతుంది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్లకు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం ఉదయం గం.9:00లకు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 13 పాయింట్ల స్వల్పలాభంతో 10,948.00 వద్ద ట్రేడవుతోంది.  చైనా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య సత్సంబంధాలు మళ్లీ చిగురించవచ్చనే ఆశావహంతో శుక్రవారం ఆసియా, ఐరోపా, అమెరికా ఈక్విటీ మార్కెట్లు 1శాతానికి పైగా ర్యాలీచేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 10,927 పాయింట్ల వద్ద ముగిసింది.



You may be interested

ఫ్లాట్‌ ప్రారంభం

Monday 21st January 2019

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న భారత స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రధాన సూచీలైన ఎన్‌ఎస్‌ఈ నిప్టీ ఇండెక్స్‌ 12 పాయింట్ల లాభంతో 10,919.35 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 81 పాయింట్ల లాభంతో 36,467.12 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో అధిక సంఖ్యలో ఆయా కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్త సూచీల ఫ్లాట్‌  ప్రారంభానికి కారణమని

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 21st January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి. ఎల్‌ అండ్ టీ:- తన షేర్లను బైబ్యాక్‌ చేయాలన్న నిర్ణయానికి అనుమతిచ్చేందుకు సెబీ( మార్కెట్‌ నియంత్రణ సంస్థ) నిరాకరించింది. బైబ్యాక్‌ ఆఫర్‌ కంపెనీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని సెబీ అధికారులు పేర్కోన్నారు. ఎల్‌ అండ్‌ టి మొత్తం 6.1 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయాలని భావించింది. ఒక్కో షేరుకు రూ. 1,475 చెల్లించాలని నిర్ణయించింది. ఈ లెక్కన ఈ

Most from this category