STOCKS

News


స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 4th February 2019
Markets_main1549249149.png-23991

విదేశీ మార్కెట్లలో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపు(10911.50)తో పోలిస్తే ఉదయం 8:30లకు 10 పాయిం‍ట్ల నష్టంతో 10,901 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి(10914)తో పోలిస్తే 14 పాయిం‍ట్ల క్షీణతతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్ప నష్టాల ట్రేడింగ్‌ కారణంగా నేడు నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
లాభాల్లో ఆసియా మార్కెట్లు:-
వాణిజ్య వివాద పరిష్కారం కోసం అమెరికా-చైనా జరిగి చర్చలు ఆశావహంగా ముగిసినట్లు చైనా అధికారుల ప్రకటనతో ఆసియాలో నేడు ట్రేడయ్యే మార్కెట్లన్నీ లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ మార్కెట్‌కు యెన్‌ బలహీనపడవచ్చనే అశావహనంతో ఆ దేశ ఇండెక్స్‌ నికాయ్‌225 100 పాయింట్ల పెరిగి (అరశాతం) 20,892.59 పెరిగింది. హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 0.10శాతం (27.35 పాయింట్ల) స్వల్పలాభంతో వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ అరశాతం(15 పాయింట్లు)లాభంతో 3,194.52 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండోనేషియా జకర్తా 6పాయిం‍ట్ల స్వల్ప లాభంతో 6,544.98 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే చైనా, తైవాన్‌, దక్షిణ కొరియా మార్కెట్లు నేడు సెలవులో ఉన్నాయి.
మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు:-
అమెరికా జనవరి ఉపాధి గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో శుక్రవారం రాత్రి ఆ దేశ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జనవరి 1.72లక్షల మందికి ఉపాధి కల్పన జరగవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనావేయగా, ఈ నెలలో ఏకంగా 3.4లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. అమెజాన్‌ నిరుత్సాహకరమైన ఫలితాల ప్రకటనతో పాటు ఈ వారంలో అమెరికా దేశానికి చెందిన కీలక గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమతత్త మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా ప్రధాన ఇండెక్సలైన డౌజోన్‌ 64పాయింట్లు పెరిగి 25,063.89 వద్ద, ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌ 2.50 పాయింట్ల స్వల్ప లాభంతో 2,706.53 వద్ద ముగిశాయి. మరోవైపు నాస్‌డాక్‌ 18 పాయింట్లు నష్టపోయి 7,263.87 ముగిశాయి.You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 4th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు టెక్‌ మహీంద్రా:- నెదర్లాండ్‌ కంపెనీ డైనోకామర్స్‌ను 4.39 మిలియన్‌ యూరోలకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- రుణాల పరిష్కారానికి సంబంధించిన గతంలో రూపొందించిన ప్రణాళిక తరహా ప్రతిపాదననే ఎన్‌సీఎల్‌టీ ముందు కూడా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈద్‌ ప్యారీ:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో కంపెనీ రూ.250 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌:- డిజిటల్‌

బడ్జెట్‌పై ఫండ్‌ మేనేజర్ల మనోగతం

Sunday 3rd February 2019

రైతులకు నగదు ప్రయోజనాన్ని అందించే కిసాన్‌ సమ్మాన్‌ పథకం, అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్‌, రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం కలిగిన వారికి మినహాయింపు వంటి ఎన్నో ప్రయోజనాలను మధ్యంతర బడ్జెట్‌ తీసుకొచ్చింది. ఇవన్నీ మార్కెట్‌కు సానుకూలమేనని మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్ల అభిప్రాయం. బడ్జెట్‌పై వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌, వాటి మేనేజర్ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   ద్రవ్య క్రమశిక్షణతో కూడిన వృద్ధి అనుకూల బడ్జెట్‌.

Most from this category