STOCKS

News


స్వల్పలాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd February 2019
Markets_main1550908497.png-24297

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి స్వల్ప లాభంతో 10,809.50 వద్ద  ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10808.80 పాయింట్లతో పోలిస్తే కేవలం 0.75 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ దాదాపు ఫ్లాట్‌గా ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 5శాతం అప్‌:- 
అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గత రాత్రి లాభాల్లో ముగిశాయి. టాటామోటర్స్‌ ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ షేర్లు 5శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 5శాతం లాభపడి 12.39 డాలర్ల వద్ద స్థిరపడింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 2.50శాతం లాభపడి 36.88డాలర్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ షేరు అరశాతం లాభంతో 100డాలర్ల వద్ద ముగిసింది. 

 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Saturday 23rd February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం లాభపడింది. గతరాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు పెరిగి 1,332.80 డాలర్ల వద్ద ముగిసింది.  వరుసగా రెండోవారం లాభాల ముగింపు కావడం విశేషం. డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుదల, ట్రేడ్‌ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత పసిడికి తోడ్పాటును అందిస్తున్నాయి.  వడ్డీరేట్లపై ఫెడ్‌రిజర్వ్‌ సానుకూల ధోరణి.. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌  ర్యాలీకి అవరోధాన్ని కలిస్తుంది. ఈ వారంలో డాలరు ఇండెక్స్‌ నెలరోజుల కనిష్టానికి

వీఐఎక్స్‌ తగ్గడంతో మార్కెట్‌కు స్థిరత్వం

Saturday 23rd February 2019

శుక్రవారం వొలటాలిటీ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 3.74 శాతం తగ్గి 15.45 పాయింట్ల వద్దకు దిగిరావడంతో మార్కెట్‌కు స్థిరత్వం వస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌కు చెందిన టెక్నికల్‌ విశ్లేషకుడు చందన్‌ తపారియా అంటున్నారు. వీఐక్స్‌ 16కుపైన వుంటే మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతాయని, 16 దిగువన కొనుగోలు మద్దతు లభిస్తుందన్న భావన ట్రేడర్లలో వుంటుంది. ఇక నిఫ్టీ అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే 10,750పైన నిలవాల్సివుంటుందని, ఆ సందర్భంలో 10,820 పాయింట్లు, అటుతర్వాత 10,888 పాయింట్ల వరకూ

Most from this category