News


ఎస్‌జీఎక్స్‌నిఫ్టీ 57 పాయింట్లు అప్‌

Saturday 8th June 2019
Markets_main1559985162.png-26177

ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం లాభాల్లో ముగిసింది. సింగపూర్‌లో నిన్న రాత్రి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు అరశాతం (57 పాయింట్లు) లాభంతో ముగిసింది. నిఫ్టీ -50 ఫ్యూచర్స్‌ ముగింపు(11900.75)తో పోలిస్తే 57 పాయింట్లు పెరిగి 11,956.00 వద్ద స్ధిరపడింది. శుక్రవారం దేశీయంగా సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు లోనై చివరికి స్వల్ప లాభంతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 39,616 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,871 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు బలంగా ఉన్నప్పటికీ, డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 20 పైసలు నష్టపోవడం, ముడి చమురు ధరలు పెరగడం తదితర అంశాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.  
 



You may be interested

నెమ్మదిగా కొనసాగుతున్న రేట్‌కట్‌ బదిలీ

Saturday 8th June 2019

ఆర్‌బీఐ ప్రకటిస్తున్న వడ్డీరేట్ల తగ్గింపు బ్యాంకుల ద్వారా కస్టమర్లకు చాలా నెమ్మదిగా చేరుతోందని కోటక​ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. ఆర్‌బీఐ ఆశించినంత వేగంగా రేట్‌కట్‌ బదిలీ జరగడం లేదని పేర్కొంది. అయితే నెమ్మదిగానైనా రేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీ అవుతున్నందున ఈ ఏడాది కస్టమర్లకు అందే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపింది.  ఆర్‌బీఐ గణాంకాలు పరిశీలిస్తే టర్మ్‌ డిపాజిట్‌ రేట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. 2017 నవంబర్‌ 2018 మార్చి

విద్యార్థుల వసతి మార్కెట్‌లోకి రూ.700 కోట్లు

Saturday 8th June 2019

50 బిలియన్‌ డాలర్లను ఆకర్షించే సత్తా ఉంది నైట్‌ఫ్రాంక్‌ సంస్థ నివేదికలో అంచనా న్యూఢిల్లీ: దేశంలో విద్యార్థుల వసతుల (స్టూడెంట్‌ హాస్టల్‌) మార్కెట్‌ గతేడాది 100 మిలియన్‌ డాలర్ల (రూ.700కోట్లు) నిధులను ఆకర్షించినట్టు నైట్‌ఫ్రాంక్‌ సంస్థ తెలిపింది. ప్రస్తుత డిమాండ్‌, సరఫరా మధ్య అంతరాన్ని తొలగించేందుకు గాను ఈ విభాగానికి 50 బిలియన్‌ డాలర్ల (రూ.3.5 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం ఉందని పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో 3.4

Most from this category