STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 15th October 2018
Markets_main1539574279.png-21142

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 6 పాయింట్ల నష్టతో 10,473 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,486 పాయింట్లతో పోలిస్తే 13 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి.

ఆసియా మార్కెట్లు నష్టాల్లో..
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల భయాలు, అమెరికా అధిక రుణ వ్యయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 315 పాయింట్ల నష్టంతో 22,379 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 25,582 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,062 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 145 పాయిం‍ట్ల నష్టంతో 9,900 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 12 పాయింట్ల నష్టంతో 2,594 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,154 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌
అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌ అయ్యింది. శుక్రవారం లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 287 పాయిం‍ట్ల (1.15 శాతం) లాభంతో 25,340 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 39 పాయింట్ల (1.42 శాతం) లాభంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 168 పాయింట్ల (2.29 శాతం) లాభంతో 7,496 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం మొత్తంగా చూస్తే ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 4.1 శాతం, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 4.2 శాతం, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.7 శాతం నష్టపోయాయి. అలాగే ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.72 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 3.32 శాతం, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 6.63 శాతం లాభపడ్డాయి. అమెరికాలో శుక్రవారం నాడు అక్కడి దిగ్గజ బ్యాంకులు అదిరిపోయే ఎర్నింగ్స్‌ ప్రకటించడంతో ఫైనాన్షియల్‌ రంగ షేర్లు బాగా పెరిగాయి. అలాటే టెక్నాలజీ, కన్సూమర్‌ డిస్క్రీషనరీ స్టాక్స్‌ కూడా జోరుచూపాయి.



You may be interested

మార్కెట్‌ ఎటు?

Monday 15th October 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. అమెరికా మార్కెట్‌ రీబౌండ్‌ అయ్యింది. శుక్రవారం లాభాల్లో ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 287 పాయిం‍ట్ల (1.15 శాతం) లాభంతో 25,340 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 39 పాయింట్ల (1.42 శాతం) లాభంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 168 పాయింట్ల (2.29 శాతం) లాభంతో 7,496 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం

పతనాలకు వెరవని ఈక్విటీ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు

Sunday 14th October 2018

మార్కెట్లలో కరెక్షన్‌ సాధారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. మార్కెట్‌ ర్యాలీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపే ఇన్వెస్టర్లు, పతనాల్లో మాత్రం దూరం ఉంటుంటారు. అంతేకాదు ఉన్నదంతా ర్యాలీల్లో ఇన్వెస్ట్‌ చేసి, కరెక్షన్‌లో భయపడి అమ్ముకునే వారు కూడా ఉన్నారు. కానీ, ఇటీవలి కాలంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లలో పరిణతి కనిపిస్తోంది. మార్కెట్‌ కరెక్షన్లు చూసి రిటైల్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు భయపడడం లేదు సరికదా, అదనంగా

Most from this category