STOCKS

News


ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 26th April 2019
Markets_main1556248957.png-25350

రెండు రోజులపాటు భారీ హెచ్చుతగ్గులకు లోనైన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించే  సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.45  గంటలకు దాదాపు ఫ్లాట్‌గా11,730 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,726 పాయింట్ల వద్ద ముగిసింది.  బుధవారం రాత్రి అమెరికాలో రికార్డు గరిష్టస్థాయి వద్ద ముగియగా, డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ అరశాతం నష్టంతో ముగిసింది. తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌, చైనా సూచీలు అరశాతం నష్టపోగా, తైవాన్‌ వెయిటెడ్‌ సూచి 1 శాతంవరకూ పతనమయ్యింది. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి స్వల్పలాభంతోనూ, కొరియా కోస్పి, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ సూచీలు స్వల్ప నష్టాలతోనూ ట్రేడవుతున్నాయి. 



You may be interested

గ్యాప్‌అప్‌ ప్రారంభం

Friday 26th April 2019

రెండు రోజులపాటు భారీ హెచ్చుతగ్గులకు లోనైన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్ల లాభంతో 38,865 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 11,684 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడించిన యాక్సిస్‌ బ్యాంక్‌ 2 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 764 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ

ఎఫ్‌అండ్‌వో నుంచి 34 బయటకు... వీటి పట్ల జాగ్రత్త!

Friday 26th April 2019

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ మార్కెట్‌ నుంచి జూన్‌ సిరీస్‌ తర్వాత 34 కంపెనీలు కనిపించవు. ఈ కంపెనీల సెక్యూరిటీలను ఎఫ్అండ్‌వో నుంచి తొలగించాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని చాలా మంది నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ కంపెనీల స్టాక్స్‌కు దూరంగా ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు.    ఎఫ్‌అండ్‌వో నుంచి కనుమరుగయ్యే వాటిల్లో అలహాబాద్‌ బ్యాంకు,  అజంతా ఫార్మా, బీఈఎంఎల్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, సియట్‌, సీజీ పవర్‌ అండ్‌

Most from this category