STOCKS

News


భారీ నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 26th February 2019
Markets_main1551152398.png-24326

భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఉద్రికత్త వాతవరణానికి తోడు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌తో మంగళవారం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ తీవ్ర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.8:45లకు ఇండెక్స్‌ 83.50 పాయింట్ల భారీ నష్టంతో 10809.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి  10887.05 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్‌ పరిధిలోకి చొచ్చుకుపోయిందని వార్తలు వెలువడ్డాయి. భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్‌ పరిధిలోకి రావడానికి ప్రయత్నించింది. అయితే పాకిస్థాన్ ఎయిర్‌‌ఫోర్స్ ప్రతిఘటించడంతో భారత్‌ ఎయిర్‌క్రాఫ్‌లు వెనక్కి వెళ్లిపోయాయి. అని​పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి, మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ చేసిన తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బ్రెగ్జిట్‌ ఆందోళన మరోసారి తెరపైకి రావడంతో ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతుండటం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండంతో నేడు దేశీయ సూచీలు సైతం తీవ్ర నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 26th February 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఎమ్‌కో:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా సంజ‌య్ భ‌గ‌త్‌న‌గ‌ర్ రాజీనామా చేశారు.  లుపిన్‌:- కీళ్ల నొప్పుల నివార‌ణ చికిత్సలో వినియోగించే ప్రేడ్నిసోలోన్ ఔష‌ధ విక్రయాల‌న‌కు యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమ‌తులు ద‌క్కించుకుంది.  మాస్తెక్‌:-  కంపెనీ షేర్ల‌ను ఐడీఎఫ్‌సీ ఏఎంసీ లిమిటెడ్ కొనుగోలు చేసింది.  వాటా కొనుగోలుతో కంపెనీలో మొత్తం వాటా 5.02శాతానికి చేరుకుంది.  హెచ్ఐఎల్‌:- రూ.276 కోట్ల విలువైన రుణ‌సదుపాయానికి ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ సంస్థ ఎఎ- రేటింగ్‌ను

మోదీ తక్కువ మెజారిటీతో వస్తే మార్కెట్‌కు ఇబ్బందే: శర్మ

Tuesday 26th February 2019

రానున్న నెలల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఎన్నికలు పెద్ద అనిశ్చితి అంశంగా ప్రముఖ ఇన్వెస్టర్‌, ఫస్ట్‌ గ్లోబల్‌ జాయింట్‌ ఎండీ శంకర్‌ శర్మ పేర్కొ‍న్నారు. ఎన్నికలతో ముడిపడి ఉన్న రిస్క్‌ను ఇన్వెస్టర్లు నిర్లక్ష్యం చేయడానికి లేదన్నారు. ‘‘ఇది చాలా పెద్ద కార్యక్రమం. దీని ప్రాధాన్యతను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మార్కెట్‌పై చాలా పెద్ద ప్రభావం చూపించే అంశం. గత ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించినప్పుడు అంతా అనుకూలంగా ఉంది. కానీ, ఇప్పుడా

Most from this category