STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Tuesday 14th May 2019
Markets_main1557803937.png-25715

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో  కొనసాగడంతో ఆసియా మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో వరుసగా 9 రోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ మంగళవారం  సైతం గ్యాప్‌డౌన్‌తో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు  40 పాయింట్లకుపైగా నష్టపోయి11,138 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,181 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా ఆసియాలో జపాన్‌ నికాయ్‌ సూచి 0.8 శాతం పడిపోయింది. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 1.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది.  సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ 1 శాతంపైగా పతనంకాగా, తైవాన్‌, చైనా సూచీలు అరశాతం వరకూ నష్టాలతో కదులుతున్నాయి.  కొరియా మార్కెట్‌ మాత్రం స్వల్పలాభంతో ట్రేడవుతోంది. 



You may be interested

మరో నష్టాల ప్రారంభం

Tuesday 14th May 2019

వరుసగా 9 రోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం సైతం క్షీణతతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66 పాయింట్ల తగ్గుదలతో 37,025 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్ల క్షీణతతో 11,222 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు ఇంట్రాడేలో 20 శాతం వరకూ పడిపోయిన సన్‌ఫార్మా తాజాగా 2 శాతం పెరిగింది. వేదాంత, అదాని పోర్ట్స్‌, టీసీఎస్‌, ఐటీసీలు స్వల్పలాభంతో మొదలయ్యాయి. మరోవైపు జీ

ఎన్నికలైతే తిరిగి విదేశీ నిధుల రాక: ట్రేడింగ్‌బెల్స్‌ 

Tuesday 14th May 2019

మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే కనీసం పదేళ్ల కాలాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ట్రేడింగ్‌బెల్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌గుప్తా సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడి, ఓ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తే తిరిగి విదేశీ నిధులు దండిగా వస్తాయని అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ సందర్భంగా వివిధ అంశాలపై ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  ఎన్నికల ముందు ఇన్వెస్టర్ల ముందున్న మార్గం? ఎటుంటి సానుకూల ట్రిగ్గర్లు లేకపోవడంతో సూపర్‌ ట్రెండ్‌, ఎంఏసీడీ సెల్‌

Most from this category