STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల ముగింపు..

Saturday 8th December 2018
Markets_main1544247746.png-22763

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 91 పాయింట్ల నష్టంతో 10,647 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,735 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు మళ్లీ భారీ నష్టాల్లో క్లోజయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే.. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటానికి తోడు రూపాయి రికవరీ జత కావడంతో స్టాక్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 361 పాయింట్లు లాభపడి 35,673 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 10,694 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.   



You may be interested

ఆసియా మార్కెట్లు: ఆ రెండూ నష్టాల్లో..

Saturday 8th December 2018

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. హాంగ్‌ సెంగ్‌, స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌లు నష్టపోతే.. మిగిలిన ఇండెక్స్‌లు లాభాల్లో క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 4 పాయింట్ల నష్టంతో 3,111 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 76 పాయింట్ల లాభంతో 9,760 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 1 పాయింటు లాభంతో 2,605 పాయింట్ల వద్ద ఉంది.

అధిక ధర కావాలంటే?

Saturday 8th December 2018

సాక్షి, హైదరాబాద్‌: మనం కొన్న స్థలానికి లేదా ఇంటికి భవిష్యత్తులో మంచి ధర రావాలంటే? అభివృద్ది చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాన్ని.. పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు వంటి సౌకర్యాలకు చేరువలో ప్రాపర్టీ ఉండేలా చూసుకోవాలి. సొంతింటి విషయానికొస్తే మనకేం కావాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చూడటానికి ఇల్లు ఎలా ఉంది? అందులోని సదుపాయాలు, చుట్టుపక్కల ప్రాంతం మౌలిక వసతులు ఉన్నంత మాత్రానే మంచి ఇల్లు అని అనుకోలేం. వీటితో పాటూ

Most from this category