STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పతనం..

Thursday 20th December 2018
Markets_main1545276492.png-23086

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 88 పాయింట్ల నష్టంతో 10,898 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,986 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు బుధవారం నష్టపోయాయి.  

ఆసియా మార్కెట్లు డౌన్‌ 
సింగపూర్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 3 పాయింట్ల లాభంతో 3,062 పాయింట్ల వద్ద ఉంది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 55 పాయింట్ల నష్టంతో 9,728 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 10 పాయింట్ల నష్టంతో 2,539 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 14 పాయింట్ల నష్టంతో 2,064 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 141 పాయింట్ల నష్టంతో 25,724 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225 ఏకంగా 356 పాయింట్ల నష్టంతో 20,631 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లకు ఫెడ్‌ దెబ్బ
అమెరికా మార్కెట్లు బుధవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా.. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.49 శాతం లేదా 352 పాయిం‍ట్ల నష్టంతో 23,323 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.54 శాతం లేదా 39 పాయింట్ల నష్టంతో 2,506 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.17 శాతం లేదా 147 పాయింట్ల నష్టంతో 6,636 పాయింట్ల వద్ద ముగిసింది. 2019లో వడీ రేట్ల పెంపు ఉంటుందని, అయితే తక్కువగా ఉంటుందని అమెరికా ఫెడరల్‌ రిజర్వు అంచనా వేసింది. దీంతో సరళ విధాన పాలసీలను ఆశించిన ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. దీంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. కాగా ఫెడరల్‌ రిజర్వు గతంలో 2019లో మూడు సార్లు రేట్ల పెంపు ఉంటుందని పేర్కొంటే.. తాజాగా రెండు సార్లు మాత్రమే పెంపు ఉండొచ్చని తెలిపింది. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా?

Thursday 20th December 2018

గురువారం స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 88 పాయింట్ల నష్టంతో 10,898 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో రేట్ల శ్రేణి 2.25- 2.5 శాతానికి చేరింది. 2019లో రెండు సార్లు రేట్ల పెంపు ఉండొచ్చని పేర్కొంది.  ♦ అమెరికా ఆర్థిక వ్యవస్థ

10,950 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 19th December 2018

మార్కెట్‌ ర్యాలీ బుధవారం కూడా ఆగలేదు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీసీ షేర్ల అండతో సూచీలు వరుసగా ఏడోరోజూ లాభాలతో ముగిశాయి.  నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 10,967 వద్ద, సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభంతో 36484 వద్ద స్థిరపడ్డాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ రెండోరోజూ కొనసాగడం, బాండ్ల బైబ్యాక్‌ ఇష్యూ ద్వారా ఈ నెలలో అదనంగా మరో రూ.10,000 కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేయాలనే

Most from this category