STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Thursday 18th October 2018
Markets_main1539838148.png-21266

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 10:00 గంటల సమయంలో 86 పాయింట్ల నష్టంతో 10,374 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,443 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ రోజంతా ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే..  నిప్టీ శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాలతోనే ట్రేడవుతున్నాయి. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొజిట్‌ ఏకంగా 2 శాతంమేర పతనమైంది. ఇక అమెరికా మార్కెట్లు కూడా బుధవారం నష్టాల్లోనే ముగిశాయి.
కాగా దసరా సందర్భంగా ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లకు గురువారం సెలవు. మార్కెట్లు తిరిగి శుక్రవారం నాడు ప్రారంభమౌతాయి. ఇక బుధవారం రోజు భారీ లాభాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు చివరకు అదేస్థాయి నష్టాలతో క్లోజయ్యాయి. సెన్సెక్స్‌ 383 పాయింట్లు పతనమై 34,780 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 10,453 పాయింట్ల వద్ద ముగిశాయి.



You may be interested

అమెరికా మార్కెట్‌ డౌన్‌

Thursday 18th October 2018

కంపెనీలు ఎర్నింగ్స్‌ అదిరిపోవడంతో మంగళవారం 2 శాతానికిపైగా పెరిగిన అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు బుధవారం రోజు అదే జోరును కొనసాగించలేకపోయాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వు సెప్టెంబర్‌ సమావేశపు మినిట్స్‌.. రానున్న రోజుల్ల ఎక్కువ సార్లు వడ్డీ రేట్ల పెంపుకు సాంకేతాలివ్వడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థ స్థిర వృద్ధిక కఠిన ద్రవ్య విధానాలు అనుసరిస్తామని ఫెడ్‌ పేర్కొంది. అలాగే ఐబీఎం ఎర్నింగ్స్‌ అంచనాల

ఆసియా మార్కెట్లు నష్టాల్లో..

Thursday 18th October 2018

చైనా షాంఘై కంపొజిట్‌ 2 శాతం పతనం ఆసియా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగియడం, ఫెడరల్‌ రిజర్వు సెప్టెంబర్‌ సమావేశపు మినిట్స్‌ వడ్డీ రేట్ల పెంపును సూచిస్తుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొజిట్‌ ఏకంగా 2 శాతం మేర పతనమైంది. నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జపాన్‌ నికాయ్‌ 225.. 176 పాయింట్ల

Most from this category