STOCKS

News


11400 వద్దకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd March 2019
Markets_main1553332351.png-24767

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం భారీ నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపు(11470)తో పోలిస్తే 63 పాయింట్ల నష్టంతో 11,407.00 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11472.40 పాయింట్లతో పోలిస్తే 71 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. వచ్చే వారంలో గురువారం(28న)మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు ఉండటంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ పరిమాణాల పరిశీలించినట్లైతే చైనా-అమెరికా చర్చల అంశంతో పాటు బ్రెగ్జిట్‌ అంశం కీలకం కానుంది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే) గత పాలసీ వివరాలు మినిట్స్‌ ద్వారా 25న వెల్లడికానున్నాయి. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే.. ఎనిమిదిరోజుల సుదీర్ఘర్యాలీ అనంతరం మార్కెట్లో లాభాల స్వీకరణ పూనుకోవడంతో సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్ల నష్టపోయి 38164 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు క్షీణించి 11457 వద్ద స్థిరపడ్డాయి.



You may be interested

రెండు నెలల తర్వాత గడ్డుకాలం?

Saturday 23rd March 2019

మార్కెట్‌పై యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా దేశీయంగా కొనసాగుతున్న ర్యాలీ మరో రెండు నెలలు ఉండొచ్చని, కానీ ఆ తర్వాత వాల్యూషన్ల కారణంగా చల్లబడిపోతుందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌతం చచ్చోరియా అభిప్రాయపడ్డారు. తాజా అప్‌మూవ్‌తో రెండుమూడు నెలల్లో పలు స్టాకుల వాల్యూషన్లు చాలా ఖరీదుగా మారతాయన్నారు. మోదీ ప్రభుత్వం మరోమారు విజయం సాధిస్తుందన్న నమ్మకం, లిక్విడిటీ వరద  ప్రస్తుత ర్యాలీకి ప్రధాన కారణాలన్నారు. ఈ కారణాలతో మరో రెండు నెలలు

కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ఆరంభం

Saturday 23rd March 2019

కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ఆరంభం -రూ.2,750 కోట్లు సమీకరణ  -సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తమ లండన్‌ బ్రాంచ్‌ ఈ బాండ్లను జారీ చేస్తుందని, ఈ బాండ్ల ద్వారా 40 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.2,750 కోట్లు) సమీకరించనున్నామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. మీడియమ్‌ టర్మ్‌ నోట్‌ (ఎమ్‌టీఎన్‌) ప్రోగ్రామ్‌ కింద ఈ సీనియర్‌ అన్‌ సెక్యూర్డ్‌ బాండ్లు(మీడియన్‌ టర్మ్‌ నోట్స్‌)ను

Most from this category