STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు డౌన్‌

Thursday 14th February 2019
Markets_main1550114172.png-24183

ప్రపంచ మార్కెట్లతో సంబంధంలేకుండా వరుస నష్టాల్ని చవిచూస్తున్న భారత్‌ సూచీలు గురువారం సైతం ప్రతికూలంగా ప్రారంభయ్యే సంకేతాల్ని సూచిస్తూ ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 10,761 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,823 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు  అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు 0.5-1 శాతం మధ్య ర్యాలీ జరిపాయి., తాజాగా చైనా ఎగుమతి దిగుమతి గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘైలు అరశాతంపైగా క్షీణించాయి. సింగపూర్‌, కొరియా సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.  జపాన్‌, తైవాన్‌ సూచీలు మాత్రం స్వల్పలాభాలతో కదులుతున్నాయి.



You may be interested

సెన్సెక్స్‌ లాభం...నిఫ్టీ నష్టం

Thursday 14th February 2019

వరుస నష్టాల్ని కొనసాగిస్తూ గురువారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 7 పాయింట్ల నష్టంతో 10,786 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మాత్రం 30 పాయింట్ల లాభంతో 36,065 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ప్రారంభమైన కొద్ది క్షణాల్లో సూచీలు రెండూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆర్‌బీఐ నుంచి క్లీన్‌చిట్‌ పొందినట్లు ప్రకటించిన యస్‌ బ్యాంక్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 25 శాతం జంప్‌చేసి రూ. 215 వద్దకు చేరింది.

ఈ మార్కెట్లో కొనతగిన షేర్లు ఏవి...?

Thursday 14th February 2019

మన ఈక్విటీ మార్కెట్లు చూడ్డానికి బలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లతోపాటు కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల అండతో సూచీలు ఒక నిర్ణీత పరిధిలో చలిస్తున్నాయి. కానీ, మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ మాత్రం ఎప్పటికప్పుడు కనిష్టాలకు పడిపోతూనే ఉన్నాయి. చాలా స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 40 శాతానికి పైగా నష్టపోయినవే. ఇండెక్స్‌ కాకుండా విడిగా స్టాక్స్‌ను పరిశీలిస్తే కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ సైతం 30-50

Most from this category