STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 61 పాయింట్లు డౌన్‌..

Wednesday 26th December 2018
Markets_main1545794730.png-23228

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల లాభంతో 10,620 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,681 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. కాగా క్రిస్మస్‌ సందర్భంగా మంగళవారం ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. అలాగే అమెరికా మార్కెట్లు కూడా పనిచేయలేదు.

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయితే హాంగ్‌ కాంగ్‌ మార్కెట్‌కు సెలవు. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 35 పాయింట్ల నష్టంతో 3,015 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 17 పాయింట్ల లాభంతో 9,544 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 7 పాయింట్ల నష్టంతో 2,498 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 33 పాయింట్ల నష్టంతో 2,022 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225.. 86 పాయింట్ల లాభంతో 19,241 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.    

అమెరికా మార్కెట్లు మళ్లీ పతనం
అమెరికా మార్కెట్లు సోమవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌, డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఏకంగా 2.91 శాతం లేదా 653 పాయిం‍ట్ల నష్టంతో 21,792 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.71 శాతం లేదా 66 పాయింట్ల నష్టంతో 2,351 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.21 శాతం లేదా 140 పాయింట్ల నష్టంతో 6,192 పాయింట్ల వద్ద ముగిసింది. 



You may be interested

మార్కెట్‌పై వీటి ప్రభావం!!

Wednesday 26th December 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ.. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,681 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయితే హాంగ్‌ కాంగ్‌ మార్కెట్‌కు సెలవు. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 35 పాయింట్ల నష్టంతో 3,015 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌

జీడీపీ కంటే వృద్ధి చెందుతున్న స్టాక్స్‌ 

Tuesday 25th December 2018

దేశ జీడీపికి, స్టాక్‌ మార్కెట్‌కు మధ్య పరస్పర సంబంధం ఉందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అందుకే జీడీపీలో భాగమైన రంగాలు, రాబడులకు భరోసానిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వివేకం. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీని మించి మెరుగైన పనితీరు చూపించిన స్టాక్స్‌పై ఓ సంస్థ అధ్యయనం చేసింది. రూ.500 కోట్ల మార్కెట్‌ క్యాప్‌పైన గల 875 కంపెనీలను పరిశీలించింది. నిర్వహణ లాభం, ఈపీఎస్‌ వృద్ధి జీడీపీ కంటే ఎక్కువగా

Most from this category