STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 29th August 2018
Markets_main1535512946.png-19732

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:40 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో 11,746 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో సోమవారం నాటి ముగింపు 11,705 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ బుధవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు చైనా మినహా ఇతర ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. 

చైనా మినహా ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో..
ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క చైనా మాత్రం 6 పాయింట్ల స్వల్ప క్షీణతతో 2,772 పాయింట్ల వద్ద ఉంది. ఇక జపాన్‌ నికాయ్‌ 225.. 155 పాయింట్ల లాభంతో 22,968 పాయింట్ల వద్ద ఉంది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 43 పాయింట్ల లాభంతో 28,394 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 3 పాయింట్ల లాభంతో 2,306 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 75 పాయిం‍ట్ల లాభంతో 11,064 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 3 పాయింట్ల లాభంతో 3,251 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్‌లో స్వల్ప లాభాలు..
అమెరికా మార్కెట్‌ మంగళవారం స్వల్ప లాభంతో అక్కడక్కడే ముగిసింది. అయినా కూడా ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌లు గరిష్ట ముగింపు స్థాయిలను నమోదు చేశాయి. ఎస్‌అండ్‌పీ 500 కేవలం 1 పాయింటు పెరుగుదలతో 2,898 పాయింట్ల వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 12 పాయింట్ల లాభంతో 8,030 వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 14 పాయింట్ల లాభంతో 26,064 వద్ద ముగిసింది. మార్కెట్‌లో టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌ పెరిగితే.. ఎనర్జీ, టెలికం, మెటీరియల్స్‌ స్టాక్స్‌ తగ్గాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Wednesday 29th August 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆగస్ట్‌ 28న కొత్త గరిష్ట స్థాయిలకు చేరింది. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు ఇందుకు కారణం. నిప్టీ-50 కొత్త గరిష్ట స్థాయి 11,760ని తాకింది. అయితే ప్రాఫిట్‌ బుకింగ్‌ వల్ల తిరిగి ప్రారంభ స్థాయి సమీపంలోకే వచ్చింది. డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో డోజి రకపు క్యాండిల్‌ను ఏర్పరచింది.  నిఫ్టీ-50 మంగళవారం 11,750 మార్క్‌ను అధిగమించింది. 11,760 పాయింట్ల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకుంది. దీంతో ఇండెక్స్‌ 11,700 సమీపంలోకి

కొనసాగిన రికార్డుల పరంపర

Tuesday 28th August 2018

11700 పైన ముగిసిన నిఫ్టీ 39000ల చేరువలో సెన్సెక్స్‌ మార్కెట్‌లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ట్రేడింగ్‌ ఆద్యంతం దూకుడును ప్రదర్శించిన సూచీలు చివరకు ఆల్‌టైం రికార్డుల్లో స్థిరపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలకు తోడు, హెవీ వెయిట్‌ షేర్లైన  రిలయన్స్‌ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మారుతి, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ, మెటల్‌ షేర్ల అండతో సూచీలు మంగళవారం మరోకొత్త రికార్డు వద్ద ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ

Most from this category