STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 5th December 2018
Markets_main1543980356.png-22628

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 64 పాయింట్ల నష్టంతో 10,848 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,907 పాయింట్లతో పోలిస్తే 59 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు మంగళవారం భారీగా కుప్పకూలాయి. 

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 30 పాయింట్ల నష్టంతో 3,138 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 151 పాయింట్ల నష్టంతో 9,932 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 15 పాయింట్ల నష్టంతో 2,651 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,105 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 396 పాయింట్ల నష్టంతో 26,864 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 89 పాయింట్ల నష్టంతో 21,946 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. తైవాన్‌, హాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగానే పడిపోయాయి. 

కుప్పకూలిన అమెరికా మార్కెట్లు 
అమెరికా మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 3.1 శాతం లేదా 799 పాయిం‍ట్ల నష్టంతో 25,027 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 3.24 శాతం లేదా 90 పాయింట్ల నష్టంతో 2,700 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.8 శాతం లేదా 283 పాయింట్ల నష్టంతో 7,158 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌, ఇండస్ట్రీయల్‌ షేర్లు పడిపోవడంతో ఇండెక్స్‌లు నష్టపోయాయి. దీర్ఘకాల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ క్షీణించడం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఇన్వెస్టర్లలో మళ్లీ ఆందోళనలు చెలరేగడం వల్ల ఇండెక్స్‌లు పడిపోయాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Wednesday 5th December 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 64 పాయింట్ల నష్టంతో 10,848 పాయింట్ల వద్ద ఉంది.  ♦ రిజర్వు బ్యాంక్‌ బుధవారం (నేడు) జరగనున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించడం ఇందుకు కారణంగా పేర్కొన్నారు.  ♦ క్రూడ్‌ ధరలు బుధవారం ఒక శాతం

హార్లిక్స్‌, బూస్ట్‌లను ఎందుకు అమ్మేసినట్టు?

Wednesday 5th December 2018

బ్రిటిష్‌ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లయిన్‌ (జీఎస్‌కే) భారత్‌లోని తన పోషకాహార వ్యాపారాన్ని హిందుస్తాన్‌ యూనిలీవర్‌లో విలీనం చేయడానికి ఒప్పందం చేసుకుంది. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న హార్లిక్స్‌తోపాటు ఎక్కువ మార్కెట్‌ వాటా కలిగిన బూస్ట్‌ను, వివా, మాల్టోవా బ్రాండ్లను జీఎస్‌కే వదులుకోవడానికి కారణమేంటన్న ప్రశ్న ఇన్వెస్టర్లకు ఎదురుకావచ్చు. ఇందుకు విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఇవీ...   జీఎస్‌కే కంపెనీ భారత్‌లోని తన కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ ఇండియాను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్న రోజునే... అమెరికా కేంద్రంగా

Most from this category