STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Monday 17th September 2018
Markets_main1537154858.png-20300

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:50 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 54 పాయింట్ల నష్టంతో 11,493 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,547 పాయింట్లతో పోలిస్తే 54 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క జపాన్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. 

ఆసియా సూచీలు నష్టాల్లో..
ఒక్క జపాన్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 273 పాయింట్ల లాభంతో 23,095 పాయింట్ల వద్ద ఉంది. ఇక దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 18 పాయింట్ల నష్టంతో 2,300 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 459 పాయింట్ల నష్టంతో 26,826 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 17 పాయింట్ల నష్టంతో 3,144 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 36 పాయిం‍ట్ల నష్టంతో 10,832 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 22 పాయింట్ల నష్టంతో 2,659 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

అమెరికా మార్కెట్లు మిశ్రమం..
అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభాల్లో.. నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 9 పాయిం‍ట్ల లాభంతో 26,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,904 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల నష్టంతో 8,010 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా దిగుమతులపై 200 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధిస్తామని మరోమారు స్పష్టం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. 



You may be interested

మార్కెట్‌ పయనం ఎటు?

Monday 17th September 2018

శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే జోరు కొనసాగించింది. 11,500 మార్క్‌ పైకి వెళ్లింది. డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను, వీక్లి చార్ట్స్‌లో హ్యామర్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. నిఫ్టీ ఇండెక్స్‌ 145 పాయింట్ల లాభంతో (1.28 శాతం) 11,515 వద్ద ముగిసింది. అయితే వారం పరంగా చూస్తే 0.6 శాతంమేర క్షీణించింది.  ఇండియా వీఐఎక్స్‌ 3.24 శాతం తగ్గుదలతో 13.78కి క్షీణించింది. ఈ తగ్గుదల మార్కెట్‌లో కొంత స్థిరత్వాన్ని

మీ ఎస్‌బీఐ యావరేజ్‌ బ్యాలన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు ఇలా...

Monday 17th September 2018

బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాదారులు అందరూ తమ ఖాతాల్లో నెలవారీ సగటు బ్యాలన్స్‌ (ఎంఏబీ) నిర్వహించడం తప్పనిసరి. ఎస్‌బీఐ ఖాతాదారుల విషయంలో ఈ ఎంఏబీ అన్నది వారి బ్యాంకు శాఖ నగరంలోనా లేదా పట్టణం లేదా గ్రామీణ ప్రాంతంలో ఉందా అన్నదాన్ని బట్టి మారిపోతుంది. నెలవారీ సగటు బ్యాలన్స్‌ నిర్వహణలో విఫలం అయితే, ఖాతాదారుల నుంచి బ్యాంకులు చార్జీలు రాబట్టుకుంటాయి. ఓ నివేదిక ప్రకారం 21 ప్రభుత్వరంగ బ్యాంకులు, 3 ప్రైవేటు

Most from this category