STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Friday 5th October 2018
Markets_main1538709882.png-20865

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:38 సమయంలో 53 పాయింట్ల నష్టంతో 10,551 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,631 పాయింట్లతో పోలిస్తే 80 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ శుక్రవారం నెగటివ్‌గా లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లోనే ముగిశాయి. 

నష్టాల్లో ఆసియా సూచీలు
అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం, దీంతో ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, ఈ నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీ రేట్లను వేగంగానే పెంచొచ్చనే అంచనాలతో ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 191 పాయింట్ల నష్టంతో 23,784 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 130 పాయింట్ల నష్టంతో 26,493 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 200 పాయిం‍ట్ల నష్టంతో 10,519 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 15 పాయింట్ల నష్టంతో 2,259 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 24 పాయింట్ల నష్టంతో 3,207 పాయింట్ల వద్ద ఉన్నాయి. అయితే చైనా మార్కెట్‌కు సెలవు. శుక్రవారం చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.   

అమెరికా మార్కెట్లు డౌన్‌..
అమెరికా మార్కెట్లు గురువారం నష్టపోయాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు బలంగా ఉండటం వల్ల ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుతూనే ఉండటం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఏర్పడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ గత ఆరు సెషన్లలోనూ తొలిసారి పడిపోయింది. జూన్‌ 25 నుంచి చూస్తే నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఎక్కువగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 201 పాయిం‍ట్ల నష్టంతో 26,627 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 23 పాయింట్ల నష్టంతో 2,901 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 146 పాయింట్ల నష్టంతో 7,879 పాయింట్ల వద్ద ముగిసింది. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Friday 5th October 2018

శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్లు గురువారం నష్టపోయాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు బలంగా ఉండటం వల్ల ట్రెజరీ ఈల్డ్స్‌ పెరుగుతూనే ఉండటం ప్రతికూల ప్రభావం చూపింది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఏర్పడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ గత ఆరు సెషన్లలోనూ తొలిసారి పడిపోయింది. జూన్‌ 25 నుంచి చూస్తే నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఎక్కువగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 201 పాయిం‍ట్ల నష్టంతో

నిఫ్టీ ఫార్వార్డ్‌ పీఈ@20... ఇప్పుడిక కొనొచ్చా?

Thursday 4th October 2018

తాజా మార్కెట్‌ పతనంతో అంతర్జాతీయ మార్కెట్‌ క్యాప్‌లో భారత వాటా పదేళ్ల చారిత్రక సగటు 2.5 శాతానికి దిగొచ్చిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన నివేదికలో పేర్కొంది. ఆగస్ట్‌లో 3 శాతం, జూలైలో 6 శాతం పెరిగిన సూచీలు, సెప్టెంబర్‌ నుంచి చూస్తే ఇప్పటికి 10 శాతం మేర పతనం అయ్యాయి. దీంతో ఈ ఏడాది జూలైలో ఉన్న స్థాయికి సూచీలు తిరిగొచ్చేశాయి. దీర్ఘకాలం పాటు వేచి ఉండే

Most from this category