STOCKS

News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Saturday 10th November 2018
Markets_main1541825009.png-21837

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతోనే ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 10,572 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం నాటి ముగింపు స్థాయి 10,623 పాయింట్లతో పోలిస్తే 51 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే.. అప్పుడు నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు శుక్రవారం ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం పడిపోయాయి. ఇండెక్స్‌లు 1 శాతంమేర క్షీణించాయి. క్రూడ్‌ ధరలు తగ్గడం, ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంచుతామని సాంకేతాలివ్వడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. కాగా శుక్రవారం ఇండియన్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 79 పాయింట్ల నష్టంతో 35,159 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 10,585 పాయింట్ల వద్ద ముగిశాయి.  



You may be interested

10,620 పైన ముగిసే వరకు లాంగ్స్‌ వద్దు..!

Saturday 10th November 2018

ముంబై: శుక్రవారం ఉదయం 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. అంతక్రితం ముగింపుతో పోల్చితే 17 పాయింట్ల లాభంతో ప్రారంభమైన ఈ ప్రధాన సూచీ.. ఇంట్రాడేలో 10,619 పాయింట్ల వద్ద గరిష్టస్థాయిని, 10,545 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. న్యారోరేంజ్‌లో కొనసాగి ముగింపు సమయానికి 10,600 స్థాయిని అధిగమించలేకపోయింది. అయితే, ఈ సూచీ డైలీ చార్టులో హామర్‌ క్యాండిల్‌ను ఏర్పాటుచేయడం ద్వారా

అమెరికా మార్కెట్ల ఎన్నికల ర్యాలీ సమాప్తం..

Saturday 10th November 2018

ప్రధాన ఇండెక్స్‌లు దాదాపు 1 శాతం డౌన్‌ అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు దాదాపు 1 శాతంమేర క్షీణించాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.77 శాతం లేదా 202 పాయిం‍ట్ల నష్టంతో 25,989 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 300 పాయింట్లకుపైగా పడిపోయింది. చివరకు కొంత కోలుకుంది. క్యాటర్‌పిల్లర్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.92 శాతం లేదా 26

Most from this category