STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు డౌన్‌

Monday 10th September 2018
Markets_main1536549555.png-20102

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:41 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 11,585 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,632 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..
ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియా ఇండెక్స్‌లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 7 పాయింట్ల లాభంతో 22,314 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,285 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇక హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 274 పాయింట్ల నష్టంతో 26,698 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 14 పాయింట్ల నష్టంతో 3,120 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 19 పాయింట్ల నష్టంతో 2,683 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 114 పాయిం‍ట్ల నష్టంతో 10,732 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   

అమెరికా మార్కెట్లు డౌన్‌..
అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 79 పాయిం‍ట్ల నష్టంతో 25,916 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500 కేవలం 6 పాయింట్ల నష్టంతో 2,872 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 20 పాయింట్ల నష్టంతో 7,902 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.



You may be interested

మార్కెట్‌ ఎటువైపు?

Monday 10th September 2018

నిఫ్టీ శుక్రవారం 11,558 వద్ద ప్రారంభమైంది. అయితే తర్వాత 11,500 దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 11,484 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే తర్వాత మళ్లీ పుంజుకొని 11,603 గరిష్ట స్థాయికి ఎగసింది. అయితే ఈ స్థాయిల్లో కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ చోటుచేసుకుంది. దీంతో ఇండెక్స్‌ 11,600 మార్క్‌కు దిగువకు వచ్చేసింది. చివరకు 52 పాయింట్ల నష్టంతో 11,589 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌ డైలీ చార్ట్స్‌లో చిన్న బుల్లిష్‌

ఇప్పట్లో మార్కెట్‌ క్రాష్‌ ఉండదు: ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌

Sunday 9th September 2018

దేశీయ స్టా్క్‌‌ మార్కెట్లు సమీప కాలంలో పతనమయ్యే అవకాశాల్లేవని, అలాగని సమీప కాలంలో వేగంగా పెరిగే అవకాశాలు కూడా లేవని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ గ్రూపు చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ తెలిపారు. ఫార్మా, ఆటోమొబైల్‌ రంగంలో ఎంపిక చేసిన స్టాక్స్‌ను పెట్టుబడులకు ఎంచుకోవచ్చని సూచించారు. ఓ ‍ప్రముఖ వార్తా సంస్థకు ఈ మేరకు ఇంటర్వ్యూ ఇచ్చారు.    అంతర్జాతీయ సమస్యలే మార్కెట్లకు ఆందోళన కలిగించే అంశాలుగా బందోపాధ్యాయ చెప్పారు. రూపాయి పతనం అన్నది ఓ

Most from this category