STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ముగింపు

Saturday 8th September 2018
Markets_main1536377382.png-20067

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 11,584 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,632 పాయింట్లుగా ఉంది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌తో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ముగిసిందని గమనించాలి. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఒక్క చైనా మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉండటం, అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే క్లోజవ్వడం కూడా ప్రతికూల అంశాలు. 

ఆసియా మార్కెట్లు నష్టాల్లో..
చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 181 పాయింట్ల నష్టంతో 22,307 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ కేవలం 1 పాయింటు నష్టంతో 26,973 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 77 పాయిం‍ట్ల నష్టంతో 10,846 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,282 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 13 పాయింట్ల నష్టంతో 3,134 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అయితే చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 11 పాయింట్ల లాభంతో 2,702 పాయింట్ల వద్ద ముగిసింది. 

అమెరికా మార్కెట్లు డౌన్‌..
అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 79 పాయిం‍ట్ల నష్టంతో 25,916 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500 కేవలం 6 పాయింట్ల నష్టంతో 2,872 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 20 పాయింట్ల నష్టంతో 7,902 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

మరోవైపు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు  శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 38,389 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 11,589 పాయింట్ల వద్ద ముగిశాయి. 



You may be interested

టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ జంప్‌..

Saturday 8th September 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం ఒకటి, రెండూ మినహా దాదాపుగా అన్నీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గితే... టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికిపైగా ఎగసింది.  విప్రో ఏడీఆర్‌ 0.75 శాతం క్షీణతతో 5.30 డాలర్లకి తగ్గింది. అలాగే

భిన్నమైన ఈ ఫార్మా కంపెనీలే నయం: దీపేన్‌ మెహతా

Saturday 8th September 2018

పెద్ద ఫార్మా కంపెనీలకు బదులు భిన్నమైన వ్యాపార నమూనా కలిగిన ఫార్మా కంపెనీలను పెట్టుబడుల కోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు మెహతా సూచించారు. పెట్టుబడుల కోసం ఆయన పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సువెన్‌, దివిస్‌ ఫార్మా కంపెనీలను సూచించారు. అలాగే, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ సైతం మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ బెట్‌గా పేర్కొన్నారు.   బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ ‘‘ఈ కంపెనీలో మాతోపాటు, మా క్లయింట్లు కూడా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారు. ఈ కంపెనీకి ఉన్న విభిన్నమైన వ్యాపార నమూనా

Most from this category