STOCKS

News


సోమవారం నిఫ్టీ ఓపెనింగ్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 22nd December 2018
Markets_main1545460760.png-23165

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 5 పాయింట్ల నష్టంతో 10,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,767 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇకపోతే మన మార్కెట్ల విషయానికి వస్తే.. సెన్సెక్స్‌ 690 పాయింట్లు నష్టపోయి 35,742 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 198 పాయింట్లు పతనమై 10,754 వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 1.89 శాతం, నిఫ్టీ 1.81 శాతం చొప్పున క్షీణించాయి. మొత్తం అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే ఈ వారంలో సెన్సెక్స్‌ 221 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 



You may be interested

డౌజోన్స్‌ 1,655 పాయింట్లు పతనం

Saturday 22nd December 2018

వారంలో ఈ స్థాయిలో పడిపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి గరిష్ట స్థాయి నుంచి నాస్‌డాక్‌ 22 శాతం క్రాష్‌;  ఎస్‌అండ్‌పీ 18 శాతం క్షీణత అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం.. డౌజోన్స్‌ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.81 శాతం లేదా 414 పాయిం‍ట్ల నష్టంతో 22,445 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ

ఇంటి ఎంపికలో గృహిణిదే ఆధిపత్యం

Saturday 22nd December 2018

సాక్షి, హైదరాబాద్‌: సొంతింటి ఎంపికలో మగవాళ్ల కంటే మహిళలదే పై చేయి. సొంతిల్లు కొనుగోలు నిర్ణయం నుంచి ప్రాంతం, బడ్జెట్‌ ఎంపిక వరకూ అన్నింట్లోనూ గృహిణి నిర్ణయాధికారమే ఆధిపత్యంగా ఉందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కన్జ్యూమర్‌ రీసెర్చ్‌ సర్వే తెలిపింది. గృహ నిర్మాణానికి సంబంధించి కొనుగోలుదారులు అభిప్రాయం, ఎంపికలపై సర్వే నిర్వహించింది.   జాయింట్‌ ఫ్యామిలీ బదులు సొంతంగా ఉండేందుకే మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. సొంతింటి ఎంపిక విషయంలో మగవాళ్లు

Most from this category