STOCKS

News


నిఫ్టీ ఫ్లాట్‌ ఓపెనింగ్‌??

Thursday 22nd November 2018
Markets_main1542857332.png-22275

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల నష్టంతో 10,616 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,621 పాయింట్లతో పోలిస్తే 5 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లోనే ముగిశాయి. 

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ మాత్రం 18 పాయింట్ల లాభంతో 9,759 పాయింట్ల వద్ద ఉంది. ఇక సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ కేవలం 1 పాయింటు నష్టంతో 3,037 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 6 పాయింట్ల నష్టంతో 2,645 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,070 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 25 పాయింట్ల నష్టంతో 25,945 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 4 పాయింట్ల నష్టంతో 21,504 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, క్రూడ్‌ ధరలు మళ్లీ పెరడగం, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు కారణంగా మార్కెట్లపై ఒత్తిడి నెలకొంది. 
 
లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్‌
అమెరికా మార్కెట్ల వరుస రెండు రోజుల పతనానికి అడ్డు కట్ట పడింది. బుధవారం నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిస్తే, డౌజోన్స్‌ ఫ్లాట్‌గా క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఫ్లాట్‌గా 24,465 పాయింట్ల వద్దే ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.3 శాతం లేదా 8 పాయింట్ల లాభంతో 2,649 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.92 శాతం లేదా 63 పాయింట్ల లాభంతో 6,972 పాయింట్ల వద్ద ముగిసింది. ఎనర్జీ, టెక్నాలజీ షేర్లలో రిబౌండ్‌ చోటుచేసుకోవడంతో అమెరికా మార్కెట్‌ ఇండెక్స్‌లు మళ్లీ లాభాలోకి వచ్చాయి. అయితే థాంక్స్‌గివింగ్‌ హాలిడే నేపథ్యంలో యాపిల్‌ షేర్ల లాభాలు హరించుకుపోవడంతో చిరవకు మార్కెట్లు ఫ్లాట్‌గానే ముగిశాయి. 



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Thursday 22nd November 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 5 పాయింట్ల నష్టంతో 10,616 పాయింట్ల వద్ద ఉంది.  ♦ప్రపంచ ఆర్థిక వృద్ధి ‘బలహీనత’ దిశగా పయనిస్తోందని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్ల వ్యవస్థ దిశగా పయనం వంటి

యస్‌ బ్యాంకు ప్రమోటర్ల మధ్య సంధి కుదిరేనా!

Wednesday 21st November 2018

యస్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రాణా కపూర్‌, సహ ప్రమోటర్‌ మధు కపుర్‌తో సంధి కోసం చర్చలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు జవనరి 31తో ఎండీ, సీఈవో పదవుల నుంచి రాణా కపూర్‌ వైదొలగాల్సి ఉంది. దీంతో ఆయన చర్చలకు తెరతీయడం ఆసక్తికరం. ‘‘మధు కపుర్‌, ఆమె కుటుంబంతో పరస్పర పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లతో రెండు ప్రమోటర్ల గ్రూపుల మధ్య

Most from this category