STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Tuesday 13th November 2018
Markets_main1542079339.png-21913

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 48 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,503 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా సోమవారం భారీ నష్టాల్లోనే ముగిశాయి.  

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
అమెరికా మార్కెట్ల పతనం  ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 32 పాయింట్ల నష్టంతో 3,036 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 131 పాయిం‍ట్ల నష్టంతో 9,699 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 13 పాయింట్ల నష్టంతో 2,617 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 35 పాయింట్ల నష్టంతో 2,045 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 391 పాయింట్ల నష్టంతో 25,242 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 715 పాయింట్ల నష్టంతో 21,554 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు పతనం
అమెరికా మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా పతనమయ్యాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.32 శాతం లేదా 602 పాయిం‍ట్ల నష్టంతో 25,387 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.97 శాతం లేదా 55 పాయింట్ల నష్టంతో 2,726 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఏకంగా 2.78 శాతం లేదా 206 పాయింట్ల నష్టంతో 7,200 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ నష్టపోవడం ఇండెక్స్‌లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. యాపిల్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ షేర్లు బాగా పడిపోయాయి. యాపిల్‌ షేరు ఏకంగా 5 శాతంమేర పతనమైంది. యాపిల్‌ కంపెనీకి విడిభాగాలను సరఫరా చేసే సంస్థలు వాటి అంచనాలను తగ్గించుకోవడం ఇందుకు కారణం. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా?

Tuesday 13th November 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ► అమెరికా మార్కెట్లు సోమవారం పతనం కావడం, డాలర్‌ 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం, యూరప్‌లోని రాజకీయ అస్థిరతలు, క్రూడ్‌ ధరలు తగ్గుదల వంటి అంశాల కారణంగా ఆసియా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 32 పాయింట్ల నష్టంతో 3,036 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 131 పాయిం‍ట్ల నష్టంతో 9,699 పాయింట్ల వద్ద,

కంపెనీల బలాలను గుర్తించమే ఇన్వెస్టర్‌ సత్తా

Monday 12th November 2018

ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ ‘మోట్స్‌’ అనే అంశం ఇన్వెస్టర్లు అందరికీ అనుసరణీయమే. వ్యాపార రంగంలో ఒక కంపెనీకి పోటీ పరంగా ఉన్న సానుకూలతలు, బలాలను ఇది తెలియజేస్తుంది. పోటీ పరంగా సానుకూలత, సంబంధిత కంపెనీ వ్యాపారం నిర్వహించే రంగంలోకి ప్రవేశించడానికి ఇతర కంపెనీలకు చాలా కష్టమైన అంశం కావడం లేదా ఆ కంపెనీ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోవడం అసాధ్యమైన అంశాలనేవి మోట్స్‌ కిందకు వస్తాయి.    ఓ కంపెనీకి ప్రస్తుత

Most from this category