News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Tuesday 18th December 2018
Markets_main1545103771.png-23013

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 46 పాయింట్ల నష్టంతో 10,867 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,910 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం మళ్లీ పతనమయ్యాయి. 

ఆసియా మార్కెట్ల నష్టాలు.. 
అమెరికా మార్కెట్ల పతనం కారణంగా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 50 పాయింట్ల నష్టంతో 3,064 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 55 పాయింట్ల నష్టంతో 9,732 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 15 పాయింట్ల నష్టంతో 2,583 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,063 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 183 పాయింట్ల నష్టంతో 25,905 పాయింట్ల వద్ద, జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225... ఏకంగా 264 పాయింట్ల నష్టంతో 21,242 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

14 నెలల కనిష్టానికి డౌజోన్స్‌
అమెరికా మార్కెట్లు సోమవారం పతనమయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.11 శాతం లేదా 507 పాయిం‍ట్ల నష్టంతో 23,592 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌కు ఇది 14 నెలల కనిష్ట స్థాయి. ఎస్‌అండ్‌పీ 500.. 2.08 శాతం లేదా 54 పాయింట్ల నష్టంతో 2,545 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.27 శాతం లేదా 157 పాయింట్ల నష్టంతో 6,753 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనల నేపథ్యంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు పాలసీ సమావేశం కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లను సంబంధించి ఫెడ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆందోళనగా ఉన్నారు.  



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 18th December 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 46 పాయింట్ల నష్టంతో 10,867 పాయింట్ల వద్ద ఉంది.  ♦ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్‌ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ

2018లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు ఇలా...

Tuesday 18th December 2018

ఈక్విటీ ఇన్వెస్టర్లకు 2008 మాదిరే 2018 బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడిన కాలం ఇది. ముఖ్యంగా ఈ ఏడాది మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ బాగా నష్టపోయాయి. వీటితో పోలిస్తే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో నష్టాలు తక్కువగా ఉన్నాయి. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయానికొస్తే... ఏ పథకాలు మంచి పనితీరు చూపించాయి, వేటి పనితీరు చతికిలపడిందన్న డేటా ఇన్వెస్టర్లకు తెలుసుకోవాల్సి ఉంది...    ముఖ్యంగా ఈ ఏడాది ఐటీ విభాగం

Most from this category