News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Friday 10th May 2019
Markets_main1557457672.png-25643

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో వుండటంతో  చవిచూసిన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం సైతం గ్యాప్‌డౌన్‌తో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40  గంటలకు దాదాపు 40 పాయింట్ల తగ్గుదలతో 11,296 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,336 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నుంచి ఒక మంచి లేఖ అందుకున్నానంటూ గురువారం అమెరికా అధ్యక్షుడు వెల్లడించడంతో శుక్రవారం ఉదయం షార్ట్‌ కవరింగ్‌ ఫలితంగా ఆసియా సూచీలు భారీగా పెరిగినప్పటికీ, తదుపరి సగం లాభాల్ని కోల్పోయాయి. ఈ రోజు నుంచే చైనాపై అమెరికా టారీఫ్‌ల పెంపు అమల్లోకి రానుండగా, మరోవైపు ఇరుదేశాల మధ్య గురువారం ముగియాల్సిన చర్చల్ని శుక్రవారానికి పొడిగించారు. ఈ అంశాల నేపథ్యంలో ట్రేడ్‌ డీల్‌ కుదరడానికి 50 శాతం అవకాశం వుందన్న అంచనాలు మార్కెట్లో కొనసాగుతున్నాయి. తాజాగా  హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ , చైనా షాంఘై, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ , తైవాన్‌ వెయిటెడ్‌, జపాన్‌ నికాయ్‌ సూచీలు ఒక శాతం వరకూ లాభాలతో ట్రేడవుతున్నాయి. . గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు ఒకదశలో 2 శాతం వరకూ పతనమైన అనంతరం ట్రేడింగ్‌ ముగింపులో నష్టాల్ని బాగా తగ్గించుకున్నాయి. 



You may be interested

లాభాల ప్రారంభం

Friday 10th May 2019

అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల ఫలితంపై మార్కెట్లో డోలాయమాన స్థితి కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు స్వల్పలాభంతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 73 పాయింట్ల లాభంతో 37632 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,314 పాయింట్ల వద్ద మొదలయ్యింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నుంచి ఒక మంచి లేఖ అందుకున్నానంటూ గురువారం అమెరికా అధ్యక్షుడు వెల్లడించడంతో శుక్రవారం ఉదయం షార్ట్‌ కవరింగ్‌ ఫలితంగా ఆసియా

బేర్‌ మార్కెట్‌ రాబోతున్నది: జిమ్‌ రోగర్స్‌

Thursday 9th May 2019

ఇన్వెస్ట్‌మెంట్‌ గురు జిమ్‌ రోగర్స్‌ త్వరలోనే బేర్‌ మార్కెట్‌ వస్తుందన్న అంచనాతో ఉన్నారు. త్వరలో వచ్చే బేర్‌ మార్కెట్‌ తన జీవితంలోనే అత్యంత దారుణంగా ఉంటుందని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. తాను పెరిగే మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయనని, పడిపోయే మార్కెట్లలోనే పెట్టుబడులు పెడతానన్నారు. భారత ప్రధాని మోదీ చెప్పుకోతగ్గ పెద్ద మొత్తంలో ఏమీ చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ

Most from this category