ఎస్‌జీఎక్స్ నిఫ్టీ డౌన్..
By Sakshi

ఎస్‌జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 40 పాయింట్ల నష్టంతో 10,953 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ గురువారం ముగింపు స్థాయి 10,978 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ శుక్రవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు గురువారం కూడా నష్టపోయాయి. నష్టాల్లో ఆసియా మార్కెట్లు అమెరికా మార్కెట్ల పతనం
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 20 పాయింట్ల నష్టంతో 3,030 పాయింట్ల వద్ద, తైవాన్ సూచీ తైవాన్ ఇండెక్స్ 51 పాయింట్ల నష్టంతో 9,623 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్ షాంఘై కంపొసిట్ 22 పాయింట్ల నష్టంతో 2,514 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 6 పాయింట్ల నష్టంతో 2,053 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 122 పాయింట్ల నష్టంతో 25,501 పాయింట్ల వద్ద, జపాన్ ఇండెక్స్ నికాయ్ 225 ఏకంగా 363 పాయింట్ల నష్టంతో 20,029 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం మళ్లీ పతనమయ్యాయి. నాస్డాక్ ఇండెక్స్ 2 శాతం.. డౌజోన్స్, ఎస్అండ్పీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 1.99 శాతం లేదా 464 పాయింట్ల నష్టంతో 22,859 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 500.. 1.58 శాతం లేదా 40 పాయింట్ల నష్టంతో 2,467 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్డాక్ కంపొసిట్ 1.63 శాతం లేదా 108 పాయింట్ల నష్టంతో 6,528 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు ఇందుకు కారణం. అమెరికా ప్రభుత్వం మూతపడొచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా ఇండెక్స్‌లపై నెగటివ్ ప్రభావం చూపింది.
You may be interested
మార్కెట్ ఎటు?
Friday 21st December 2018శుక్రవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్ నెగటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 40 పాయింట్ల నష్టంతో 10,953 పాయింట్ల వద్ద ఉంది. ♦ ఇండియన్ రూపాయి గురువారం 69 పైసలు లాభపడి అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.70 వద్ద ముగిసింది. ♦ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.41,000 కోట్ల మూలధనాన్ని అందించనుంది. దీని కోసం పార్లమెంట్ అనుమతి కోరింది. ♦ ఈక్విటీ మ్యూచువల్
ఐవోసీపై విశ్లేషకుల మనోగతం
Friday 21st December 2018ప్రభుత్వరంగంలోని చుమరు ఉత్పత్తుల రిటైలింగ్ కంపెనీ ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’ (ఐవోసీ) బైబ్యాక్ ఆఫర్‌తో ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. ఒక్కో షేరు కొనుగోలు ధర రూ.149. 3.06 శాతానికి సమానమైన 29.76 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. మరి రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఆఫర్లో పాల్గొనొచ్చా? లేక తమ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు అట్టే పెట్టుకోవాలా? ఈ సందేహాలకు విశ్లేషకుల అభిప్రాయాలే సమాధానాలు. షేర్ల బైబ్యాక్ ఆఫర్‌తోపాటు ఒక్కో షేరుకు రూ.6.75ను మధ్యంతర