STOCKS

News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 20th November 2018
Markets_main1542681722.png-22193

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 7:46 సమయంలో 39 పాయింట్ల నష్టంతో 10,743 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,768 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం పతనమయ్యాయి.   

ఆసియా మార్కెట్లు డౌన్‌.. 
అమెరికా మార్కెట్ల పతనం కారణంగా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 23 పాయింట్ల నష్టంతో 3,042 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 34 పాయింట్ల నష్టంతో 9,795 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 18 పాయింట్ల నష్టంతో 2,685 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 16 పాయింట్ల నష్టంతో 2,084 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 370 పాయింట్ల నష్టంతో 26,002 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 166 పాయింట్ల నష్టంతో 21,655 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.
 
నాస్‌డాక్‌ 3 శాతం పతనం
అమెరికా మార్కెట్లు సోమవారం బాగా పడిపోయాయి. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు దాదాపు 2 శాతం మేర క్షీణిస్తే.. నాస్‌డాక్‌ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.56 శాతం లేదా 396 పాయిం‍ట్ల నష్టంతో 25,017 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.66 శాతం లేదా 46 పాయింట్ల నష్టంతో 2,690 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.03 శాతం లేదా 219 పాయింట్ల నష్టంతో 7,028 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌ పడిపోవడం ఇండెక్స్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. యాపిల్‌ 4 శాతం, అమెజాన్‌ 5 శాతం, ఫేస్‌బుక్‌ 5.7 శాతం క్షీణించాయి. ఇటీవల కాలంలో ఇండెక్స్‌లను కొత్త గరిష్ట స్థాయిలకు తీసుకెళ్లిన ఫ్యాంగ్‌ స్టాక్స్‌ కొన్ని రోజులుగా బాగా కరెక‌్షన్‌కు గురవుతున్నాయి. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌ స్టాక్స్‌ను ఫ్యాంగ్‌గా పేర్కొంటారు. ఇవి ఈ ఏడాది గరిష్ట స్థాయిల నుంచి చూస్తే దాదాపు 20 శాతానికి పైగా పతనమయ్యాయి. 



You may be interested

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Tuesday 20th November 2018

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 7:46 సమయంలో 39 పాయింట్ల నష్టంతో 10,743 పాయింట్ల వద్ద ఉంది.  ♦ రిజర్వు బ్యాంక్‌ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచే చర్యలో భాగంగా ఈ నెల 22న ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.8,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది.  ♦ కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య సోమవారం జరిగిన

విలువ తెలుసుకునేది ఎలా?

Monday 19th November 2018

స్టాక్‌ ధర సహేతుక స్థాయిలోనే ఉందా? ఓ కంపెనీ షేరులో పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ మూలాలను తప్పకుండా చూడాలంటారు నిపుణులు. అన్ని అంశాలను చూసిన తర్వాతే వాటికి అనుగునంగా షేరు ధర సహేతుక స్థాయిలోనే ఉందా? అన్న అంచనాకు రావడం సాధ్యపడుతుంది. మంచి కంపెనీని గుర్తించడమే కాదు, సరైన వ్యాల్యూషన్‌ వద్ద కొనుగోలు చేయడం కూడా ముఖ్యమైన అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కంపెనీ వ్యాపారం విలువను అంచనా

Most from this category