STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు డౌన్‌

Tuesday 22nd January 2019
Markets_main1548127760.png-23711

ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు తగ్గింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి మంగళవారం ఉదయం 8.50 గంటలకు 35 పాయింట్ల తగ్గుదలతో 10,935 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10970 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం అమెరికా మార్కెట్లకు మార్టిన్‌లూథర్ కింగ్‌డే సందర్భంగా సెలవుకాగా, యూరప్‌ సూచీలు అరశాతం నష్టాలతో ముగిసాయి. ఇందుకు అనుగుణంగా తాజాగా ఆసియాలోని ప్రధాన సూచీలన్నీ క్షీణతతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘైలు 0.6 శాతం వరకూ తగ్గగా, తైవాన్‌ వెయిటెడ్‌, 0.25 శాతం క్షీణించింది. సింగపూర్‌, జపాన్‌, కొరియా సూచీలు స్వల్పనష్టాలతో కదులుతున్నాయి. అలాగే అమెరికా ఇండెక్స్‌ ఫ్యూచర్లు సైతం అరశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 22nd January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎస్సార్‌ షిప్పింగ్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా సందీప్‌ అకోల్కర్‌ రాజీనామా చేశారు. ప్రభాత్‌ డైరీ:- పాల ప్రాసెసింగ్‌ వ్యాపారాన్ని అంతర్జాతీయ పాల వ్యాపార సంస్థ లాక్టాలిస్‌ కు రూ.1700 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. లార్సన్‌ అండ్‌ టర్బో:- నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ రూ.9000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను సెబీ రద్దు చేసిన నేపథ్యంలో కంపెనీ సెష్పల్‌ డివిడెండ్‌ జారీ అంశాన్ని పరిశీలిస్తుంది. శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌:-

సన్‌ ఫార్మా షేరు కొంటున్నారా...? తొందరొద్దు!

Tuesday 22nd January 2019

సన్‌ ఫార్మా షేరు ధర కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే 40 శాతం క్షీణించింది. దీంతో చౌకగా దొరుకుతుంది కదా అని వెంటనే కొనుగోలు చేద్దామనుకునే వారు కాస్త ఆగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్‌ కరెక్షన్‌ ఇంకా ముగిసినట్టు సంకేతాలేవీ కనిపించడం లేదని పేర్కొంటున్నారు.   షేరు అధిక వ్యాల్యూషన్లలో ఉండడం, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు, అమెరికా మార్కెట్ల నుంచి ఉత్పత్తులను రీకాల్‌ చేయడం వంటివి సన్‌ ఫార్మా విషయంలో గమనించొచ్చు. సన్‌ఫార్మా

Most from this category