STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Saturday 6th October 2018
Markets_main1538797223.png-20901

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,270 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,347 పాయింట్లతో పోలిస్తే 77 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌ లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 
శుక్రవారం ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటన వరకూ ఒక స్థాయి నష్టాల్లో కదలాడిన స్టాక్‌ మార్కెట్‌, ప్రకటన అనంతరం భారీగా నష్టపోయింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ  నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. స్టాక్‌ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడోరోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌792 పాయింట్లు (2.25 శాతం) నష్టపోయి 34,377 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 283 పాయింట్లు (2.67 శాతం) పతనమై 10,316 పాయింట్ల వద్ద ముగిశాయి. 



You may be interested

ఆసియా స్టాక్‌ సూచీలకు నష్టాలు..

Saturday 6th October 2018

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 192 పాయింట్ల నష్టంతో 23,784 పాయింట్లకు తగ్గింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,268 పాయింట్ల వద్ద ముగిసింది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 51 పాయింట్ల నష్టంతో 26,572 పాయింట్లకు క్షీణించింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 22 పాయింట్ల నష్టంతో 3,209 పాయింట్లకు తగ్గింది. తైవాన్‌ సూచీ

ఇప్పుడే ఏమైంది... ముందుంది మరింత బాదుడు!

Saturday 6th October 2018

కేవలం 25 ట్రేడింగ్‌ సెషన్లలోనే సెన్సెక్స్‌ 4,600 పాయింట్లు పతనమైంది. దీన్నొక విపత్తుగా ఇన్వెస్టర్లు భావిస్తుంటే... ఓ అనలిస్ట్‌ మాత్రం వచ్చే ఆరు వారాల్లోపే అమ్మకాల సునామీ ఉందంటున్నారు. ఇందుకు ఆయన కొన్ని కారణాలు కూడా పేర్కొన్నారు. స్థూల ఆర్థిక అంశాలు, ప్రతికూల వార్తలైన చమురు ధరలు, రూపాయి పతనం, కార్పొరేట్‌ పరిణామాలకు స్పందించే గుణం మాన మార్కెట్లకు ఉంటుందని తెలిసిందే. రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న కొన్ని అంశాలు

Most from this category