STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు

Saturday 29th September 2018
Markets_main1538195386.png-20687

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,956 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,954 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్లు స్వల్ప లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. లాభనష్టాల మధ్య సయ్యాటలాడిన స్టాక్‌ సూచీలు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు నష్టాల్లో ముగిశాయి. స్టాక్‌ మార్కెట్‌ క్షీణించడం ఇది వరుసగా మూడో రోజు. రూపాయి క్షీణత కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, లిక్విడిటీ సమస్యలు స్టాక్‌ మార్కెట్‌ను పడగొట్టాయి. వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో తాజాగా పొజిషన్లు తీసుకోవడానికి ట్రేడర్లు ముందుకు రాకపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐటీసీలు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 97 పాయింట్లు క్షీణించి 36,227 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్లు పతనమై, 10,930 పాయింట్ల వద్ద ముగిశాయి.



You may be interested

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు..

Saturday 29th September 2018

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 323 పాయింట్ల లాభంతో 24,120 పాయింట్లకు పెరిగింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 12 పాయింట్ల నష్టంతో 2,343 పాయింట్ల వద్ద ముగిసింది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 73 పాయింట్ల లాభంతో 27,788 పాయింట్లకు పెరిగింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 21 పాయింట్ల లాభంతో 3,257 పాయింట్లకు ఎగసింది. తైవాన్‌ సూచీ

వేదాంత ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 29th September 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. తటస్థంగా ఉంది. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు మాత్రం పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది.   టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.41 శాతం క్షీణతతో 15.36 డాలర్లకు తగ్గింది.

Most from this category