STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 26 పాయింట్లు డౌన్‌

Wednesday 31st October 2018
Markets_main1540956421.png-21594

గత రాత్రి అమెరికా సూచీలు 1.5 శాతం వరకూ ర్యాలీ జరిపినప్పటికీ, బుధవారం ఆసియా సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నా, సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మాత్రం ఉదయం 8.45 గంటలకు 26 పాయింట్ల తగ్గుదలతో 10,202 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారంనాడిక్కడ స్పాట్‌ నిఫ్టీ 10,198 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10,228 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ తగ్గుదల కారణంగా ఈ రోజు నెగిటివ్‌గా మార్కెట్‌ ప్రారంభమయ్యే అవకాశం వుంది. 



You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Wednesday 31st October 2018

ప్రపంచ మార్కెట్లు పటిష్టంగా వున్నా, భారత్‌ మార్కెట్‌ బుధవారం నిస్తేజంగా ప్రారంభమయ్యింది. రూపాయి విలువ బాగా తగ్గడం, కనిష్టస్థాయి నుంచి ముడి చమురు ధరలు కోలుకోవడం ఇందుకు కారణం బీఎస్‌ఈ సెన్సెక్స్‌71 పాయింట్ల పెరుగుదలతో 33,963 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 10,209 పాయింట్ల వద్ద మొదలయ్యింది. క్రితం రోజు డాలరు మారకంలో 20 పైసల మేర క్షీణించిన రూపాయి విలువ తాజాగా మరో

దేవెన్‌ చోక్సే స్టాక్‌ సిఫారసులు

Wednesday 31st October 2018

చమురు ధరల పతనం చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు మేలు చేస్తుందని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే పేర్కొన్నారు. అయితే, ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం రిటైల్‌ ఇన్వెస్టర్లకు మేలు చేసేది కాదన్నారు. పెట్టుబడి పరంగా ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు బదులు... ఈ రంగంలోనే లబ్ధి పొందే సామర్థ్యం కలిగిన రిలయన్స్‌ మంచి ఎంపిక అవుతుందని పేర్కొన్నారు. సిప్లా, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category