News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లు డౌన్‌

Friday 8th February 2019
Markets_main1549596160.png-24076

యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుదంటూ యూరోపియన్‌ కమిషన్‌ హెచ్చరించడంతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీల క్షణతకు తోడు, తాజాగా ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లుతగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 11,069 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,094 పాయింట్ల వద్ద ముగిసింది.  గత రాత్రి అమెరికా  సూచీలు 1 శాతం మేర క్షీణించగా, యూరప్‌ సూచీలు 3 శాతం వరకూ పతనమయ్యాయి. తాజాగా జపాన్‌ సూచీ 1.5 శాతం నష్టాల్లో ట్రేడవుతుండగా, సెలవుల అనంతరం ప్రారంభమైన హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1 శాతం పతనమయ్యింది.  కొరియా కోస్పి ఇండెక్స్‌ కూడా అంతేశాతం క్షీణించింది. సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది.You may be interested

నష్టాల ప్రారంభం

Friday 8th February 2019

సెన్సెక్స్‌ 190 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్లు డౌన్‌ యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుదంటూ యూరోపియన్‌ కమిషన్‌ హెచ్చరించడంతో గత రాత్రి అమెరికా, యూరప్‌ సూచీల క్షణతకు తోడు, తాజాగా ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్ల తగ్గుదలతో 36,773 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల క్షీణతతో 11,015 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు మార్కెట్‌

ఈ స్టాక్స్‌లో భవిష్యత్తు రాబడులు?

Friday 8th February 2019

స్టాక్‌ ఎంపికే రాబడులకు కీలకమన్న విషయాన్ని ఇన్వెస్టర్లు అందరూ అంగీకరిస్తారు. మరి రాబడులను ఇచ్చేవి ఏవి? అన్న ప్రశ్న తలెత్తితే... అప్పుడు నిపుణులైన ఫండ్స్‌ మనేజేర్లు, వ్యాల్యూ ఇన్వెస్టర్లు చేసే కొనుగోళ్లు, అమ్మకాలను పరిశీలించొచ్చు. దేశంలో ఆస్తుల పరంగా అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ జనవరి నెలలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్‌, చమురు రంగాలకు చెందిన షేర్లను కొనుగోలు చేసింది. అలాగే, కొన్ని

Most from this category