STOCKS

News


నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 12th December 2018
Markets_main1544585443.png-22833

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 25 పాయింట్ల నష్టంతో 10,574 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,581 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి.  

లాభాలతో దూసుకెళ్తోన్న ఆసియా మార్కెట్లు.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 25 పాయింట్ల లాభంతో 3,084 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 9,774 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 7 పాయింట్ల లాభంతో 2,600 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 22 పాయింట్ల లాభంతో 2,074 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 343 పాయింట్ల లాభంతో 26,114 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 కూడా ఏకంగా 398 పాయింట్ల లాభంతో 21,546 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

మిశ్రమంగా అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు నష్టపోతే, నాస్‌డాక్‌ లాభాల్లో క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.22 శాతం లేదా 53 పాయిం‍ట్ల నష్టంతో 24,370 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.04 శాతం లేదా 1 పాయింటు నష్టంతో 2,637 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.16 శాతం లేదా 11 పాయింట్ల లాభంతో 7,031 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రిటన్‌లో రాజకీయ అస్థిర పరిస్థితులు, చైనా-అమెరికా వాణిజ్య చర్చలు, అమెరికా ప్రభుత్వాన్ని మూసివేస్తామని ట్రంప్‌ హెచ్చరించడం వంటి అంశాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగిశాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటువైపు?

Wednesday 12th December 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 25 పాయింట్ల నష్టంతో 10,574 పాయింట్ల వద్ద ఉంది.  ♦కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ను నియమించింది.  ♦క్రూడ్‌ ధరలు బుధవారం పెరిగాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర ఒక శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు 52.15 డాలర్ల వద్ద ఉంది. ♦వ్యవస్థలో లిక్విడిటీని

మార్కెట్లపై నిపుణులు ఏమంటున్నారు?

Wednesday 12th December 2018

మార్కెట్లు దేనిని అయినా ముందే డిస్కౌంట్‌ చేసుకుంటాయన్నది మరోసారి రుజువైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు రోజే సెన్సెక్స్‌ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఈ మూడు రాష్ట్రాల్లోనూ బేజీపీ ఓటమి చెందొచ్చన్న అంచనాలే ఆ రోజు మార్కెట్‌ నష్టాలకు కారణమని విశ్లేషకుల అభివర్ణన. ఇక ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్ రాజీనామా వార్త కూడా ఆ

Most from this category