STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Tuesday 30th October 2018
Markets_main1540870572.png-21570

క్రితం రోజు రాత్రి అమెరికా మార్కెట్‌ క్షీణత కారణంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.40 గంటలకు 40 పాయింట్ల క్షీణతతో 10,244 పాయింట్ల వద్ద కదులుతోంది. ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుగుణంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కదులుతుంది. సోమవారం స్పాట్‌ నిఫ్టీ 10,250 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్‌ 10,284 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం రాత్రి అమెరికా మార్కెట్‌ 1 శాతం వరకూ పతనమైనప్పటికీ, మంగళవారం ఆసియా మార్కెట్లన్నీ క్షీణతతో మొదలయ్యాయి. అయితే ఉదయం 8.40 గంటల సమయానికి ఒక్క హాంకాంగ్‌ సూచీ తప్ప, మిగిలిన ప్రధాన సూచీలన్నీ స్వల్పలాభాల్లోకి మళ్లాయి. 
 



You may be interested

ఫ్లాట్‌ ఓపెనింగ్‌

Tuesday 30th October 2018

క్రితం రోజు రాత్రి అమెరికా మార్కెట్‌ క్షీణించినప్పటికీ, మంగళవారం భారత్‌ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2 పాయింట్ల పెరుగుదలతో 34,069 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 10,239 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారత్‌ మార్కెట్‌ 2 శాతంపైగా ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా వేదాంత, హిందాల్కో, గెయిల్‌, టాటా మోటార్స్‌ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండగా, పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలు

ఎస్‌బీఐ ‘ఏటీఎం’ ఆంక్షలు రేపటి నుంచే అమల్లోకి

Tuesday 30th October 2018

ప్రభుత్వరంగ ఎస్‌బీఐ ఏటీఎం కార్డులపై విధించిన సరికొత్త నియంత్రణలు 31 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు కలిగిన వారు ఇక నుంచి రోజులో ఏటీఎంల నుంచి రూ.20,000వరకే విత్‌డ్రా చేసుకోగలరు. ఎస్‌బీఐ ఈ ఏడాది మార్చి నాటికి 39.50 కోట్ల డెబిట్‌ కార్డులను జారీ చేసి ఉంది. ఇందులో 26 కోట్ల కార్డులు తరచుగా వినియోగిస్తున్నవి. దీంతో ఎస్‌బీఐ ఆంక్షలు చాలా మందిపై ప్రభావం చూపించనున్నాయి.    ప్రస్తుతం

Most from this category