STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Tuesday 16th October 2018
Markets_main1539660227.png-21175

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 2 పాయింట్ల నష్టతో 10,517 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,517 పాయింట్లతో పోలిస్తే సమానంగా ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా లాభాల్లో లేదా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. 

ఆసియా మార్కెట్లు లాభాల్లో..
ఒక్క సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ మినహా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 136 పాయింట్ల లాభంతో 22,407 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 32 పాయింట్ల లాభంతో 25,476 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 1 పాయింటు నష్టంతో 3,044 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 66 పాయిం‍ట్ల లాభంతో 9,967 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 9 పాయింట్ల లాభంతో 2,577 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 6 పాయింట్ల లాభంతో 2,151 పాయింట్ల వద్ద ఉన్నాయి.  

అమెరికా మార్కెట్‌ డౌన్‌..
అమెరికా మార్కెట్‌ సోమవారం నష్టాల్లోనే ముగిసింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 89 పాయిం‍ట్ల నష్టంతో 25,250 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 16 పాయింట్ల నష్టంతో 2,750 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 66 పాయింట్ల నష్టంతో 7,430 పాయింట్ల వద్ద ముగిసింది.



You may be interested

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Tuesday 16th October 2018

ఈక్విటీ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా ఇండెక్స్‌లు లాభాల్లో ఉండటం, అమెరికా మార్కెట్లు నష్టపోవడం ఇందుకు కారణం. అధిక క్రూడ్‌ ధరలు బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లపై ప్రభావం చూపవచ్చు. లాభాల్లో ప్రారంభమైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడవుతోంది.  మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ వడ్డీ రేట్లు, కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై నెలకొని ఉన్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మరీముఖ్యంగా టెక్నాలజీ స్టాక్స్‌ నష్టపోవడం వల్ల ఇండెక్స్‌లు

మిడ్‌క్యాప్‌లో దిద్దుబాటు కొనసాగుతుంది: మాక్వేర్‌

Tuesday 16th October 2018

మిడ్‌క్యాప్‌ విభాగంలో కరెక్షన్‌ కొనసాగుతుందని అంతర్జాతీయ ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ మాక్వేర్‌ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. నిధుల వ్యయాలు పెరుగుతండడమే కారణమని పేర్కొంది. వచ్చే రెండేళ్ల పాటు ఎన్నో అంశాల కారణంగా నిధుల వ్యయాలు అంతర్జాయంగా పెరుగుతాయని, ఇవి స్టాక్‌ విలువలపై ప్రభావం చూపిస్తాయని మాక్వేర్‌ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ హెడ్‌ సందీప్‌ భాటియా పేర్కొన్నారు. అయితే, ఆదాయాల్లో రికవరీ ఈ ప్రతికూల ప్రభావానికి నిరోధంగా నిలుస్తుందని భావిస్తున్నట్టు

Most from this category