STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 68 పాయింట్లు డౌన్‌..

Monday 13th August 2018
Markets_main1534130215.png-19191

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం క్షీణించింది. ఉదయం 8:43 సమయంలో 68 పాయింట్ల తగ్గుదలతో 11,364 పాయింట్లకి పడిపోయింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణం. అలాగే ఆసియా ప్రధాన సూచీలన్నీ కూడా నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో నిఫ్టీ నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 
ఆసియా మార్కెట్లు పతనం..
జపాన్‌ ఇండెక్స్‌  నికాయ్‌ 225.. 356 పాయింట్ల క్షీణతతో 21,942 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 500 పాయింట్ల క్షీణతతో 27,867 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెకస్‌ కొస్పి 33 పాయింట్ల క్షీణతతో 2,250 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 40 పాయింట్ల క్షీణతతో 3,245 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 141 పాయిం‍ట్ల క్షీణతతో 10,843 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 38 పాయింట్ల నష్టంతో 2,758 పాయింట్ల వద్ద ఉన్నాయి. 
టర్కీ లిరా పడిపోవడంతో యూరో సోమవారం ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది. 
ఇక శుక్రవారం నాడు టర్కీ సంక్షోభ భయాల వల్ల బ్యాంక్‌ షేర్లు పడిపోవడంతో అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిసిన విషయం తెలిసిందే.



You may be interested

నేటి మార్కెట్‌పై ప్రభావిత అంశాలు

Monday 13th August 2018

మార్కెట్‌పై బేర్‌ ఆధిపత్యం కారణంగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్‌ వేస్తూ నిఫ్టీ 50 శుక్రవారం క్షీణించింది. ఇండెక్స్‌ రోజంతా నెగటివ్‌ ట్రెండ్‌లోనే కదలాడింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. వారం మొత్తంగా చూస్తే స్పిన్నింగ్‌ టాప్‌ ప్యాట్రన్‌ను నమోదు చేసింది. ఇండెక్స్‌ వరుసగా మూడు వారాలుగా బలపడుతూనే వచ్చింది. దాదాపు 3.8 శాతంమేర లాభపడింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్ల నష్టంతో 37,869 పాయింట్లకు క్షీణించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌

యూటీఐ ఏఎంసీకి లియోపూరి షాక్‌

Sunday 12th August 2018

యూటీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లియోపూరి తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు. కొత్త ఎండీ నియామకంపై కోర్టు కేసు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు వాటాదారులకు పూరి తన నిర్ణయాన్ని లేఖ రూపంలో తెలియజేశారు. ‘‘నా పదవీకాలం పొడిగింపును కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాను. దీంతో ప్రణాళిక మేరకు కార్యాలయాన్ని వీడుతున్నాను’’

Most from this category