STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 12th November 2018
Markets_main1541992764.png-21877

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:39 సమయంలో 18 పాయింట్ల నష్టంతో 10,604 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,623 పాయింట్లతో పోలిస్తే 19 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ఉన్నాయి. కొస్పి, స్ట్రైట్స్‌ టైమ్స్‌ స్వల్ప నష్టాల్లో ఉంటే.. మిగతావి లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి.  

ఆసియా మార్కెట్లు మిశ్రమం.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,070 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 14 పాయిం‍ట్ల లాభంతో 9,844 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల లాభంతో 2,606 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల నష్టంతో 2,082 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 106 పాయింట్ల లాభంతో 25,708 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 34 పాయింట్ల లాభంతో 22,284 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు పతనం
అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు దాదాపు 1 శాతంమేర క్షీణించాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.77 శాతం లేదా 202 పాయిం‍ట్ల నష్టంతో 25,989 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 300 పాయింట్లకుపైగా పడిపోయింది. చివరకు కొంత కోలుకుంది. క్యాటర్‌పిల్లర్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.92 శాతం లేదా 26 పాయింట్ల నష్టంతో 2,781 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కన్సూమర్‌ డిస్క్రీషనరీ, టెక్నాలజీ స్టాక్స్‌ నష్టపోవడం ఇందుకు కారణం. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఏకంగా 1.65 శాతం లేదా 124 పాయింట్ల నష్టంతో 7,406 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌ వంటి స్టాక్స్‌ నష్టపోవడం ఇందుకు కారణం. క్రూడ్‌ ధరలు మరింత తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. క్రూడ్‌ ధరల తగ్గుదల నేపథ్యంలో గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలు మొదలయ్యాయి. చైనా వాహన విక్రయాల గణాంకాలు నిరుత్సాహపరచడం కూడా వాల్‌స్ట్రీట్‌ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోన్న సాంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఫెడరల్‌ రిజర్వు.. వడ్డీ రేట్లు పెంచుతామని సంకేతాలివ్వడం కూడా నెగటివ్‌ ప్రభావం చూపింది. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Monday 12th November 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,070 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 14 పాయిం‍ట్ల లాభంతో 9,844 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 8 పాయింట్ల లాభంతో 2,606 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల నష్టంతో 2,082

రతన్‌టాటా పెట్టుబడి సక్సెస్‌!

Sunday 11th November 2018

స్టార్టప్‌ కంపెనీల్లో టాటా గ్రూపు గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా పెట్టుబడులు పెడుతుంటారు. పదుల సంఖ్యలో ఇలా ఇప్పటి వరకు ఆయన పెట్టుబడులు పెట్టడం గమనార్హం. అయితే, ఇందులో ఓ టెక్నాలజీ స్టార్టప్‌ ఆయనకు భారీ రాబడులను తెచ్చిపెట్టిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సిలికాన్‌ వ్యాలీనే కాదు... భారతీయ పట్టణాలు సైతం టెక్నాలజీ కంపెనీల అద్భుతాలకు కేంద్రంగా మారాయంటోంది డెలాయిట్‌ సంస్థ. బెంగళూరు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌లు అత్యంత వేగంగా

Most from this category