STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ భారీ పతనం

Tuesday 11th December 2018
Markets_main1544498858.png-22811

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 155 పాయింట్ల నష్టంతో 10,363 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,514 పాయింట్లతో పోలిస్తే 151 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి.  

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,065 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 47 పాయింట్ల లాభంతో 9,695 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 3 పాయింట్ల లాభంతో 2,587 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 2 పాయింట్ల లాభంతో 2,055 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 67 పాయింట్ల లాభంతో 25,819 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 119 పాయింట్ల నష్టంతో 21,100 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు అప్‌
గత వారం 4 శాతానికి పైగా పతనమైన అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.14 శాతం లేదా 34 పాయిం‍ట్ల లాభంతో 24,423 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.18 శాతం లేదా 5 పాయింట్ల లాభంతో 2,638 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.74 శాతం లేదా 51 పాయింట్ల లాభంతో 7,020 పాయింట్ల వద్ద ముగిసింది.  యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ ఎగ్జిట్‌పై నెలకొన్న ఆందోళనలు సహా బ్యాంక్‌ షేర్లు పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనయ్యింది. అయితే టెక్నాలజీ స్టాక్స్‌ మార్కెట్లను ఆదుకున్నాయి. చివరకు ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. 



You may be interested

మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌

Tuesday 11th December 2018

సెన్సెక్స్‌ 350 పాయింట్లు పతనం 10,350కి నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,488 పాయింట్లతో పోలిస్తే 138 పాయింట్ల నష్టంతో 10,350 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,959 పాయింట్లతో పోలిస్తే 375 పాయింట్ల నష్టంతో 34,584 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌

సలహాల వెనుక వారి ప్రయోజనం ఏ మేరకు?

Tuesday 11th December 2018

మార్కెట్లలో పెట్టుబడులు, జీవిత బీమాలకు సంబంధించి సలహాలు, సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. స్నేహితులు, బంధువులు, సహచర ఉద్యోగుల సూచనలను కూడా పాటిస్తుంటారు. అలాగే, వివిధ పెట్టుబడి సాధనాలకు సంబంధించి ఉచితంగా, డబ్బులు తీసుకుని సలహాలు, సిఫారసులు ఇచ్చే వారూ ఉన్నారు. వారి సలహాల వెనుక ప్రయోజనం ఎవరికి, ఏ మేరకో తెలుసా...?   మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు యాధృచ్చికమైన సలహాలను

Most from this category