STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Thursday 4th October 2018
Markets_main1538622450.png-20830

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:22 సమయంలో 142 పాయింట్ల నష్టంతో 10,741 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,893 పాయింట్లతో పోలిస్తే 152 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ గురువారం నెగటివ్‌గా లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. 

నష్టాల్లో ఆసియా సూచీలు
ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 56 పాయింట్ల నష్టంతో 24,054 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 448 పాయింట్ల నష్టంతో 26,643 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 134 పాయిం‍ట్ల నష్టంతో 10,730 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 28 పాయింట్ల నష్టంతో 2,281 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 24 పాయింట్ల నష్టంతో 3,243 పాయింట్ల వద్ద ఉన్నాయి. అయితే చైనా మార్కెట్‌కు సెలవు. శుక్రవారం చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.   

మళ్లీ డౌజోన్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్‌..
డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ వరుసగా రెండో రోజు కూడా రికార్డ్‌ స్థాయి వద్ద మ ముగిసింది. మిగతా నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు కూడా బుధవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 54 పాయిం‍ట్ల లాభంతో 26,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట ముగింపు స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 2,925 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నాస్‌డాక్‌ కంపొసిట్‌ 26 పాయింట్ల లాభంతో 8,025 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక గణాంకాల జోష్‌తో ట్రెజరీ ఈల్డ్స్‌ పెరగడం వల్ల ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ జోరు చూపించాయి. ఏడీపీ నేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ నివేదిక ప్రకారం చూస్తే.. ప్రైవేట్‌ ఉద్యోగాలు సెప్టెంబర్‌లో 2,30,000 పెరిగాయి. ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే గరిష్ట పెరుగుదల. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సప్లై మేనేజ్‌మెంట్‌ నివేదిక ఆధారంగా చూస్తే.. సర్వీసెస్‌ సెక్టార్‌ యాక్టివిటీ 21 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయి 3.179 శాతానికి పెరిగాయి. ఇక రెండేళ్ల ఈల్డ్స్‌ దశాబ్ద కాల గరిష్టానికి ఎగశాయి. 



You may be interested

మార్కెట్‌ ఎటు?

Thursday 4th October 2018

గురువారం స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ వరుసగా రెండో రోజు కూడా రికార్డ్‌ స్థాయి వద్ద ముగిసింది. మిగతా నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు కూడా బుధవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 54 పాయిం‍ట్ల లాభంతో 26,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట ముగింపు స్థాయి. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 2,925 పాయింట్ల

పీఎస్‌యూ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4 లక్షల కోట్లు ఆవిరి

Wednesday 3rd October 2018

ప్రభుత్వరంగ లిస్టెడ్‌ కంపెనీలు ఈ ఏడాది ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించాయి. సుమారు రూ.4 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను అవి ఇంత వరకు కోల్పోయాయి. అధిక ముడి చమురు ధరలు, మొండి బకాయిల వంటి అంశాలు ఈ విధంగా నష్టాల పాల్జేశాయి. 76 ప్రభుత్వరంగ సంస్థల్లో 74 క్షీణించాయి. ముఖ్యంగా నీరవ్‌మోదీ కొట్టిన దెబ్బకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఎక్కువగా నష్టాలను ఎదుర్కొన్నది. 65 శాతం నష్టపోయింది. రైల్వే

Most from this category