STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పతనం

Monday 10th December 2018
Markets_main1544412427.png-22780

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 141 పాయింట్ల నష్టంతో 10,598 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,735 పాయింట్లతో పోలిస్తే 137 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం పతనమయ్యాయి.  

నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. 
ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 42 పాయింట్ల నష్టంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 109 పాయింట్ల నష్టంతో 9,651 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 22 పాయింట్ల నష్టంతో 2,583 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 24 పాయింట్ల నష్టంతో 2,051 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 426 పాయింట్ల నష్టంతో 25,637 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225 ఏకంగా 487 పాయింట్ల నష్టంతో 21,191 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్ల పతనం
అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోతే. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.24 శాతం లేదా 559 పాయిం‍ట్ల నష్టంతో 24,388 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.33 శాతం లేదా 63 పాయింట్ల నష్టంతో 2,633 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.05 శాతం లేదా 219 పాయింట్ల నష్టంతో 6,969 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్థిక వృద్ధి మందగమనం, నవంబర్‌ ఉద్యోగ గణాంకాలు అంచనాల కన్నా తక్కువగా నమోదు కావడం, వాషింగ్టన్‌- బీజింగ్‌ మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతల పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు పడిపోయాయి. మార్చి నుంచి చూస్తే ఇండెక్స్‌లు వారం వారీగా ఈ స్థాయిలో నష్టపోవడ ఇదే ప్రథమం. వారంలో ఇండెక్స్‌లు 4 శాతానికి పైగా క్షీణించాయి. డౌజోన్స్‌ 4.5 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 4.6 శాతం, నాస్‌డాక్‌ 4.9 శాతం పతనమయ్యాయి. 2008 నుంచి చూస్తే డిసెంబర్‌ నెలను ఇండెక్స్‌లు ఇంత చెత్తగా ప్రారంభించడం ఇదే తొలిసారి.  



You may be interested

మార్కెట్‌ ఎటు?

Monday 10th December 2018

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 141 పాయింట్ల నష్టంతో 10,598 పాయింట్ల వద్ద ఉంది.  ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 42 పాయింట్ల నష్టంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 109 పాయింట్ల నష్టంతో

ప్రతీ రూపాయి రెట్టింపు అవుతుంది.. తొందరపడొద్దు: పొరింజు

Sunday 9th December 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఇప్పుడున్న ప్రతీ రూపాయి ఏడాది క్రితం రెండు రూపాయలతో సమానమని, సెప్టెంబర్‌-అక్టోబర్‌లో వచ్చిన కరెక్షన్‌ వందలాది స్టాక్స్‌ విలువను హరించి వేసిందని స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా అధినేత పొరింజు వెలియాత్‌ అన్నారు. తన నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల ద్వారా ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఆయన తాజాగా ఒక లేఖ రాశారు. ఇప్పుడు వెనక్కి తీసుకునే ప్రతీ రూపాయిని అలాగే ఉంచేస్తే, సమీప

Most from this category